వీరత్వానికి ప్రతీక ఛత్రపతి శివాజీ: ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2023-02-14T00:08:22+05:30 IST
వీరత్వానికి ఛత్రపతి శివాజీ ప్రతీక అని, యువత లక్ష్య సాధనకు శివాజీని ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు.
జిన్నారం/పటాన్‌చెరు/రామచంద్రాపురం, ఫిబ్రవరి 13: వీరత్వానికి ఛత్రపతి శివాజీ ప్రతీక అని, యువత లక్ష్య సాధనకు శివాజీని ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు. జిన్నారం పరిధిలోని పెద్దమ్మగూడెం చౌరస్తా వద్ద సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆవిష్కరించారు. ఛత్రపతి గొప్ప పోరాట యోధుడని, ప్రజా సంక్షేమం కోసం వినూత్న పథకాలు అమలు చేశాడని, యువతరానికి స్ఫూర్తి ప్రదాత అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు, యువజనులు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, కార్పొరేటర్ పుష్పనగేష్, సర్పంచ్ లావణ్య, ఎంపీటీసీ వెంకటేశంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. రూ.20లక్షల సొంత నిధులతో అమీన్‌పూర్ మున్సిపాలిటీ సాయికాలనీలో యువత భవనానికి సోమవారం ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నర్సింహాగౌడ్, కౌన్సిలర్ బాలమణిబాల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. గీతాభూపాల్‌రెడ్డి కళాశాల 16వ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ముఖ్య అథితిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో మాజీ ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి, కార్పొరేటర్లు పుష్పనగేష్, సింధూఆదర్శరెడ్డి, ఎంపీపీ దేవానంద్, జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.