Share News

Crime News: కూతురితో సన్నిహితంగా ఉంటున్నాడనే కోపంతో..

ABN , Publish Date - Feb 16 , 2025 | 10:28 AM

సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన కూతురిని ప్రేమిస్తున్నాడని ఓ వ్యక్తిని హత్య చేశాడు తండ్రి. మెగ్యానాయక్ తండాలో 9 తరగతి చదువుతున్న బాలికతో చనువుగా ఉండటంతో దశరథ్(26) పై తండ్రి కక్ష పెంచుకున్నాడు. దీంతో.. తట్టుకోలేక ఆ వ్యక్తిని హత్య చేశాడు.

Crime News: కూతురితో సన్నిహితంగా ఉంటున్నాడనే కోపంతో..
Atrocities in Sangareddy district

సంగారెడ్డి: జిల్లాలో దారుణం జరిగింది. తన కూతురితో సన్నిహితంగా ఉంటున్నాడనే కోపంతో ఆమె తండ్రి యువకుడిని హత్య (Murder) చేశాడు. సంగారెడ్డి జిల్లా, నిజాంపేట మండలం, మెగ్యానాయక్ తండాలో 9వ తరగతి చదువుతున్న బాలికతో దశరథ్ (Dasarath)(26) అనే యువకుడు చనువుగా ఉండటంతో ఆమె తండ్రి గోపాల్ (Gopal) అతనిపై కక్ష పెంచుకున్నాడు. ఈదులతండా శివారులో దశరథ్‌ను గోపాల్ నరికి చంపాడు. అనంతరం నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. నిందితుడిని విచారించగా... ఇవాళ ఈదుల తండా శివారులో దశరథ్ మృతదేహం ముక్కలు లభ్యమయ్యాయి. నాలుగు రోజుల నుంచి దశరథ్ కనిపించకపోవడంతో అతని భార్య సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో రెండు రోజుల క్రితం పిర్యాదు చేసింది. కాగా సంగారెడ్డి శివారులోని గణపతి షుగర్ ఫ్యాక్టరీలో దశరథ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ వార్త కూడా చదవండి..

రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట.. మృతులకు పరిహారం..


మృతదేహం కోసం దశరథ్ కుటుంబ సభ్యులు బోరున విలపిస్తూ.. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పారు. నిందితుడిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతుడు దశరథ్‎కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బ్రూనో : సత్యాన్వేషణలో సజీవ స్ఫూర్తి

అబ్బురపరిచే అద్భుత లోకం

గొంతు కోసినా.. మేకులా బతికింది

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 16 , 2025 | 10:28 AM