Gudem Mahipal Reddy: కాంగ్రెస్‌పై మరోసారి రెచ్చిపోయిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
ABN , Publish Date - Mar 07 , 2025 | 08:58 AM
Gudem Mahipal Reddy: పఠాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కొన్ని రోజులుగా ఏదో ఒక వివాదంలో ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీపై మరోసారి రెచ్చిపోయి విమర్శలకు దిగారు. ఇప్పుడు ఎమ్మెల్యే వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

సంగారెడ్డి జిల్లా: పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. తీవ్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీపై ఎమ్మెల్యే కామెంట్స్ చేశారు. గుమ్మడిదల మండలం ప్యారా నగర్ డంప్ యార్డ్ విషయంలో రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కలవడానికి గ్రామస్తులు వచ్చారు. మీరు అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా .. డంప్ యార్డు ఏర్పాటు కాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. తాను కాంగ్రెస్ అధికార పార్టీ కాదు పక్కా బీఆర్ఎస్ పార్టీ.. కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అసభ్యంగా మాట్లాడారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. సమయం దాటిపోయిందని చెప్పారు. ఎమ్మెల్యే మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మహిపాల్ రెడ్డి వర్సెస్ కాటా శ్రీనివాస్ మధ్య వివాదం..
కాగా కొన్ని రోజుల క్రితం టాన్‌చెరు కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వర్సెస్ కాటా శ్రీనివాస్ మధ్య వివాదం రాజుకుంది. మహిపాల్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేశారు. క్యాడర్‌ను మహిపాల్‌రెడ్డి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎం రేవంత్ ఫొటో లేదని మండిపడ్డారు.ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులోకి కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకెళ్లారు. కేసీఆర్ ఫొటో తీసి రేవంత్‌రెడ్డి ఫొటోను కార్యకర్తలు పెట్టారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో కుర్చీలు ధ్వంసం చేశారు. క్యాంపు ఆఫీసులో కుర్చీలను కాంగ్రెస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. దీంతో పటాన్‌చెరులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వివాదంపై పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పందించారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేయడం పిరికిపందల చర్య అని ఆక్షేపించారు. రాజకీయ పరిపక్వత లేని వ్యక్తులు ఇది చేశారని మండిపడ్డారు. ఈ వివాదంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మహిపాల్ రెడ్డి మాట్లాడారు. దమ్ముంటే టైం చెప్పి రండి... నేనంటో ఏంటో చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. అధికారిక కార్యక్రమాలకు పార్టీ కార్యక్రమాలకు తేడా ఉంటుందని స్పష్టం చేశారు. కార్యకర్తలను రెచ్చగొట్టి కాటా శ్రీనివాస్ గౌడ్ ఈరోజు దాడి చేయించారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ధర్నా చేయొచ్చు కానీ దాడులు చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. తాము తలుచుకుంటే మీరు బయట తిరగలేరు... రెండుసార్లు ఓడిపోయినా కాటా శ్రీనివాస్ గౌడ్‌కు బుద్ది రాలేదన్నారు. భవిష్యత్తులో ఇలాగే చేస్తే తీవ్ర పరిణామాలుంటాయి...తప్పుకుండా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఫొటోలు ఎవరివైనా పెట్టుకోవచ్చు... రాజకీయాలకు సంబంధం లేదని చెప్పారు. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమాల వెనుక కొందరు జిల్లా నేతలు ఉన్నారు .. ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. సమయం వచ్చినపుడు ఖచ్చితంగా బయటపెడతానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు .
ఈ వార్తలు కూడా చదవండి
TG Govt: కార్మికుల ఆచూకీ కోసం క్యాండీవర్ శునకాలు!
Read Latest Telangana News And Telugu News