ఉత్సాహంగా తిరంగా బైక్ ర్యాలీ
ABN , First Publish Date - 2023-08-13T23:28:52+05:30 IST
సంగారెడ్డి అర్బన్/తూప్రాన్/నర్సాపూర్/నారాయణఖేడ్/మెదక్ అర్బన్, ఆగస్టు 13: ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా బీజేపీ కేంద్ర శాఖ పిలుపుమేరకు ‘నా మట్టి నా దేశం’ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డిలో తిరంగా బైక్ ర్యాలీ ఆదివారం నిర్వహించారు.

సంగారెడ్డి అర్బన్/తూప్రాన్/నర్సాపూర్/నారాయణఖేడ్/మెదక్ అర్బన్, ఆగస్టు 13: ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా బీజేపీ కేంద్ర శాఖ పిలుపుమేరకు ‘నా మట్టి నా దేశం’ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డిలో తిరంగా బైక్ ర్యాలీ ఆదివారం నిర్వహించారు. కందిలోని పాండురంగస్వామి ఆలయం నుంచి సంగారెడ్డిలోని పాత బస్టాండ్ వరకు తిరంగా ర్యాలీ కొనసాగించారు. ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ ఇన్‌చార్జి రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగానే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. అసెంబ్లీ కన్వీనర్ పోచారం రాములు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జగన్, విష్ణువర్ధన్‌రెడ్డి, సురేందర్, పవన్, నాగరాజు, అశ్వంత్, రాకేశ్, మురళీధర్‌రెడ్డి, పాపయ్య, నల్లనర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తూప్రాన్ మండలంలో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా జెండాల పంపిణీ చేపట్టారు. స్వాతంత్య్ర సిద్ధించి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటింటిపై జాతీయ జెండాను ఆవిష్కరించాలని ప్రభుత్వ నిర్ణయించింది. ఆదివారం నుంచి మంగళవారం వరకు జాతీయ జెండాలను ఇంటింటిపై ఆవిష్కరించాలని సూచించారు. నర్సాపూర్‌లో మాజీ సైనికులు బీ.సంగమేశ్వర్, మోహన్‌రెడ్డి నేతృత్వంలో బీవీఆర్‌ఐటీ ఎన్‌ఎ్‌సఎ్‌స ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ‘నా మట్టి నా దేశం’లో భాగంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. నర్సాపూర్‌లో ఆదివారం సాయంత్రం తిరంగ బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మురళీధర్‌యాదవ్, రాష్ట్ర నాయకులు సింగాయపల్లిగోపి, రఘువీరారెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పీ.చిన్నరమే్‌షగౌడ్, రౌన్సిలర్ రాజేందర్, నాయకులు పాల్గొన్నారు. దేశం కోసం, ధర్మం కోసం బీజేపీ ప్రభుత్వం పనిచేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే విజయపాల్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప అన్నారు. ఆదివారం నారాయణఖేడ్‌లో బీజేపీ ‘మేరే మాటి, మేరేదేశ్’ కార్యక్రమాన్ని పురస్కరించుకుని బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ రజనీకాంత్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మారుతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం విజయపాల్‌రెడ్డి పట్టణంలో నిర్వహిస్తున్న రుద్ర చండీహోమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. మేరీ మాటీ..మేరీ దేశ్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం సాయంత్రం బీజేపీ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కేంద్రంలో తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలను పట్టుకొని జిల్లా పార్టీ కార్యాలయం నుంచి పట్టణ పురవీధుల గుండా ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్‌రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ ఎక్కలదేవి మధు, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, బీజేవైం జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్‌పటేల్ పాల్గొన్నారు.