Share News

MLA: నా బాధ్యత ఇప్పుడే మరింత పెరిగింది..

ABN , First Publish Date - 2023-12-05T12:08:25+05:30 IST

నాల్గవసారి గెలుపుతో తనపై బాధ్యత మరింత పెరిగిందని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని

MLA: నా బాధ్యత ఇప్పుడే మరింత పెరిగింది..

- రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌

నార్సింగ్‌(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): నాల్గవసారి గెలుపుతో తనపై బాధ్యత మరింత పెరిగిందని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్‌(MLA T. Prakash Goud) అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకా్‌షగౌడ్‌ విజయం సాధించడంతో ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. గండిపేట మండలంలోని బీఆర్‌ఎస్‌ ప్రభాప్రతినిధులు, నాయకులు, పలు గ్రామాల నుంచి భారీగా ప్రకా్‌షగౌడ్‌ను కలసి సత్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను నాల్గవసారి గెలవడం ప్రజల ఆశీర్వాదం, వారి మద్ధతేనని, తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. గెలుపుతో పొంగిపోకుండా మరింత ఒదిగి, అంతే రెట్టింపు స్థాయిలో ప్రజలకు పనులు చేసి పెడతానని ఆయన అన్నారు. ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఎన్నిచెప్పినా, మాయలు చేసినా ప్రజలు తనకు మద్ధతుగా నిలిచారని, నాపై ఉన్న నమ్మకాన్ని చూపించారన్నారు. ప్రజల మద్దతుతో సాధించానని తనకు ఎంత సంతోషంగా ఉందో అంతే రెట్టింపు స్థాయిలో ప్రజలకు పనులు చేసి పెడతానని అన్నారు. ఎన్నికలలో ఎవరు ఏం చెప్పినా తనకు మద్దతు పలికారని, తనపై ఉన్న నమ్మకార్ని చూపించారని అన్నారు. ప్రజల నమ్మకాన్ని ఏ మాత్రం తక్కువ కాకుండ ఇచ్చిన హామిలతోపాటు మిగతా అన్ని పనులు పూర్తి చేసి వారి మన్నలు పొందుతానని అన్నారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-12-05T12:08:26+05:30 IST

News Hub