Hyderabad : ఒక్కసారిగా పెరిగిన సీజనల్ వ్యాధులు.. మంచం పట్టిన భాగ్యనగరం!

ABN , First Publish Date - 2023-07-30T13:32:31+05:30 IST

గతం వారం రోజులుగా కురిసిన వర్షాలతో హైదరాబాద్ (Hyderabad Rains) ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ వర్షాలు, వరదలతో భాగ్యనగరం మంచం పట్టింది!. నగరంలో వైరల్ ఫీవర్స్‌తో (Viral Fevers) ప్రజలు ఆస్పత్రి పాలవుతున్నారు...

Hyderabad : ఒక్కసారిగా పెరిగిన సీజనల్ వ్యాధులు.. మంచం పట్టిన భాగ్యనగరం!

గతం వారం రోజులుగా కురిసిన వర్షాలతో హైదరాబాద్ (Hyderabad Rains) ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ వర్షాలు, వరదలతో భాగ్యనగరం మంచం పట్టింది!. నగరంలో వైరల్ ఫీవర్స్‌తో (Viral Fevers) ప్రజలు ఆస్పత్రి పాలవుతున్నారు. గ్రేటర్‌లో(GHMC) ప్రభుత్వ ఆసుపత్రులకు రోగులు క్యూ కడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో నగరంలో ఒక్కసారిగా సీజనల్ వ్యాధులు పెరిగిపోయాయని అధికారులు చెబుతున్నారు. నగరంలోని ఉస్మానియా, గాంధీ, ఫీవర్ (Osmania, Gandhi, Fever Hospitals) ఆసుపత్రులకు రోగుల తాకిడి ఎక్కువైంది. ఒక్కో ఆసుపత్రికి 500 వరకు పెరిగిన ఓపీ సంఖ్య (OP) పెరిగింది. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలతో ఆసుపత్రులకు రోగులు క్యూ కడుతున్నారు. 10 రోజుల వ్యవధిలోనే జీహెచ్ఎంసీలో డెంగీ, మలేరియా కేసులు పెరగడంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.


Gandhi-hospital.jpg

పట్టించుకోండి మహాప్రభో!

కాగా.. వర్షాలు, వరదల దెబ్బకు నగర ప్రజలు ఏవిధంగా ఇబ్బందిపడ్డారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రోజుల తరబడి నగరంలోని చాలా కాలనీలు నీళ్లలోనే ఉండిపోయాయి. భారీ వరదల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నప్పటికీ సీజనల్ వ్యాధులు భయపెడుతున్నాయి. ముఖ్యంగా బస్తీలు పారిశుధ్యలేమికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాయని.. అధికారులు పట్టించుకోవట్లేదని బస్తీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దోమలు విపరీతంగా పెరిగిపోయి జ్వరం, జలుబు, దగ్గుతో పాటు టైఫాయిడ్, మలేరియా వంటి ప్రమాదకర వ్యాధులు నగర ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

Updated Date - 2023-07-30T13:39:17+05:30 IST