ఎయిర్‌పోర్ట్‌లో బంగారం పట్టివేత
ABN , First Publish Date - 2023-05-13T23:34:17+05:30 IST
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి శంషాబాద్‌కు వచ్చిన ప్రయాణికుడిని అధికారులు తనిఖీ చేయగా గోల్డ్ బిస్కెట్లు లభించాయి.

శంషాబాద్ రూరల్, మే 13 : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి శంషాబాద్‌కు వచ్చిన ప్రయాణికుడిని అధికారులు తనిఖీ చేయగా గోల్డ్ బిస్కెట్లు లభించాయి. వాటిని తూకం వేయగా 350 గ్రాములున్నట్లు గుర్తించారు. దాని విలువ రూ రూ.18.46లక్షలు ఉంటుందని అంచనా వేశారు. గోల్డ్‌ను స్వాధీనం చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.