ఫిట్స్‌తో వ్యవసాయ కూలీ మృతి
ABN , Publish Date - Feb 09 , 2025 | 11:39 PM
ఫిట్స్‌తో ఓ వ్యవసాయ కూలీ మృతిచెందాడు. ఈ ఘటన శామీర్‌పేట్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.

మూడుచింతలపల్లి, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ఫిట్స్‌తో ఓ వ్యవసాయ కూలీ మృతిచెందాడు. ఈ ఘటన శామీర్‌పేట్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కేశవరం గ్రామానికి చెందిన గణేష్(32) కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పనినిమిత్తం కేశవరం గ్రామానికి చెందిన రాములు పొలంలో పనిచేయడానికి వెళ్లాడు. పని చేస్తుండగా ఫిట్స్ వచ్చి అకస్మాత్తుగా పడటంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతిచెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.