కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య
ABN , Publish Date - Feb 09 , 2025 | 11:38 PM
కుటుంబ కలహాలతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఆదివారం జరిగింది.

దౌల్తాబాద్, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): కుటుంబ కలహాలతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. ఎస్‌ఐ రవిగౌడ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన వెంకటప్పకు 15 సంవత్సరాల కిందట కర్ణాటక రాష్ట్రం సేడం తాలూకా రెబ్బన్‌పల్లికి చెందిన లక్ష్మి(32)తో వివాహం జరిగింది. కొంత కాలంగా భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు జరుగుతుండేవి. శనివారం మధ్యాహ్నం భార్య లక్ష్మి తనకు మంగళసూత్రంలో వేసుకునే బంగారు గుండ్లు నారాయణపేట వెళ్లి తీసుకొద్దామని భర్తను కోరింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవకు దారి తీసింది. దీంతో మనస్తాపానికి గురైన భార్య లక్ష్మి ఇంట్లోకి వెళ్లి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికి వెళ్లిన భర్త చూసేసరికి అప్పటికే మృతిచెందింది. మృతురాలి తండ్రి చంద్రప్ప ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.