కొత్తూర్‌, నందిగామ పోలీస్‌స్టేషన్లు శంషాబాద్‌ ఏసీపీ పరిధిలోకి

ABN , First Publish Date - 2023-05-15T23:57:59+05:30 IST

షాద్‌నగర్‌ ఏసీపీ పరిధిలో ఉన్న కొత్తూర్‌, నందిగామ పోలీ్‌సస్టేషన్లు శంషాబాద్‌ ఏసీపీ పరిధిలోకి మారాయి.

కొత్తూర్‌, నందిగామ పోలీస్‌స్టేషన్లు శంషాబాద్‌ ఏసీపీ పరిధిలోకి

కొత్తూర్‌, మే 15: షాద్‌నగర్‌ ఏసీపీ పరిధిలో ఉన్న కొత్తూర్‌, నందిగామ పోలీ్‌సస్టేషన్లు శంషాబాద్‌ ఏసీపీ పరిధిలోకి మారాయి. పోలీ్‌సస్టేషన్ల వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్ర పోలీస్‌ శాఖ ఇటీవల మార్పులు, చేర్పులు చేపట్టింది. ఇందులో భాగంగా పోలీస్‌ ఉన్నతాధికారులు ఏసీపీల పరిపాలన సౌలభ్యం కోసం కొత్తూర్‌, నందిగామ పోలీ్‌సస్టేషన్లను శంషాబాద్‌ ఏసీపీ పరిధిలోకి మారుస్తూ గతంలో ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు జారీ అయినప్పటికీ ఇప్పటి వరకూ కొత్తూర్‌, నందిగామ పోలీ్‌సస్టేషన్లు షాద్‌నగర్‌ ఏసీపీ పరిధిలోనే కొనసాగుతూ వచ్చాయి. శంషాబాద్‌ ఏసీపీ కార్యాలయం నుంచి కొత్తూర్‌, నందిగామ పోలీ్‌సస్టేషన్ల మానిటరింగ్‌ సంబంధాలు నాలుగు రోజులుగా ప్రారంభమయ్యాయి. అయితే, షాద్‌నగర్‌ ఏసీపీ కార్యాలయ పరిధి నుంచి కొత్తూర్‌, నందిగామ పోలీ్‌సస్టేషన్లను శంషాబాద్‌కు తరలించకుండా బీఆర్‌ఎస్‌ నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. శంషాబాద్‌ ఏసీపీ కార్యాలయం కొత్తూర్‌, నందిగామ మండలాల ప్రజలకు సౌలభ్యంగా ఉండదని, షాద్‌నగర్‌ ఏసీపీ కార్యాలయం సౌలభ్యంగా ఉంటుందని నాయకులు పోలీస్‌ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల నందిగామ పోలీ్‌సస్టేషన్‌ ప్రారంభానికి విచ్చేసిన డీజీపీ అంజనీకుమార్‌ దృష్టికి సైతం తీసుకపోయినా ఫలితం లేకపోయింది.

Updated Date - 2023-05-15T23:57:59+05:30 IST

News Hub