కంటి వెలుగును వినియోగించుకోవాలి

ABN , First Publish Date - 2023-02-16T00:33:59+05:30 IST

కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని జిల్లా వైద్యాధికారి శ్రీనివాస్‌ అన్నారు.

కంటి వెలుగును వినియోగించుకోవాలి
కంటి వెలుగు శిబిరంలో రికార్డులను పరిశీలిస్తున్న జిల్లా వైద్యాధికారి శ్రీనివాస్‌

ఘట్‌కేసర్‌, ఫిబ్రవరి 15: కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని జిల్లా వైద్యాధికారి శ్రీనివాస్‌ అన్నారు. ఆయన ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో కంటి వెలుగు శిబిరాన్ని తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన రికార్డులను పరిశీలించి, అక్కడున్న వైద్యులను, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిక్షలు చేయించుకునే విధంగా అవగాన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ ముల్లి పావని జంగయ్య యాదవ్‌, కమిషనర్‌ వేమనరెడ్డి, వైస్‌ చైర్మన్‌ పల్గుల మాధవరెడ్డి, కౌన్సిలర్‌ నాగజ్యోతి, డాక్టర్‌ ఫణిందర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-02-16T00:34:00+05:30 IST