Republic Day: రాజ్‌భవన్‌లోనే రిపబ్లిక్ డే వేడుకలు

ABN , First Publish Date - 2023-01-23T19:24:50+05:30 IST

రాజ్‌భవన్‌ (Raj Bhavan)కు, ముఖ్యమంత్రి కార్యాలయానికి మధ్య దూరం పెరిగిందా? గవర్నర్‌ తమిళిసై (Governor Tamilisai), సీఎం కేసీఆర్‌లు ఎడమొహం...

Republic Day: రాజ్‌భవన్‌లోనే రిపబ్లిక్ డే వేడుకలు

హైదరాబాద్: రాజ్‌భవన్‌ (Raj Bhavan)కు, ముఖ్యమంత్రి కార్యాలయానికి మధ్య దూరం పెరిగిందా? గవర్నర్‌ తమిళిసై (Governor Tamilisai), సీఎం కేసీఆర్‌లు ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నారా? ఇద్దరి మధ్యా విభేదాలు ముదురుతున్నాయా? రోజురోజుకూ గ్యాప్‌ పెరుగుతోందా? అంటే.. తాజా పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తోంది. గణతంత్ర వేడుకలపై ఇప్పటివరకు రాజ్‌భవన్‌కు ప్రభుత్వం సమాచారం ఇవ్వలేదు. రాజ్‌భవన్‌లోనే రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఉదయం జెండా ఆవిష్కరణ, సాయంత్రం ఎట్ హోమ్ నిర్వహిస్తారు.

గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ (CM KCR) మధ్య విభేదాలు ముదురుతున్నట్లే కనిపిస్తోందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. గతేడాది రాజ్‌భవన్‌లో జరిగిన 73వ గణతంత్ర వేడుకలకు కేసీఆర్ హాజరుకాలేదు. ప్రగతి భవన్‌ (Pragati Bhavan)లోనే ఉన్నప్పటికీ కూతవేటు దూరంలోని రాజ్‌భవన్‌కు రాకపోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పరేడ్‌ గ్రౌండ్‌లోని అమర జవానుల స్మారక స్థూపం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి, నివాళులర్పించిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-01-23T19:24:51+05:30 IST