Revanth Reddy: పార్లమెంటు నమూనా తరహాలో తెలంగాణ అసెంబ్లీ
ABN , First Publish Date - 2023-12-13T14:05:47+05:30 IST
పార్లమెంట్ నమూనా తరహాలో తెలంగాణ అసెంబ్లీ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శాసనసభ,శాసన మండలి ఓకే దగ్గర నిర్మాణం ఉంటుందన్నారు.
హైదరాబాద్ : పార్లమెంట్ నమూనా తరహాలో తెలంగాణ అసెంబ్లీ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శాసనసభ,శాసన మండలి ఓకే దగ్గర నిర్మాణం ఉంటుందన్నారు. శాసనసభ, శాసన మండలి మినహా మరే ఇతర బిల్డింగ్స్ అసెంబ్లీ ప్రాంగణం లోపల ఉండవని రేవంత్ తేల్చి చెప్పారు. ఇప్పుడు ఉన్న చెట్లను తొలగించకుండా మరింత గ్రీనరీ పెంచాలన్నారు. అసెంబ్లీ కి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైల్వే గేట్‌కు అనుకుని ఉన్న ప్రహారీ గోడ ఎత్తు పెంచాలన్నారు. మెంబర్స్ ఉదయం పూట వాకింగ్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.