రాష్ట్ర రైస్‌మిల్లర్ల సంఘం ప్రధాన కార్యదర్శిగా సుధాకర్‌రావు

ABN , First Publish Date - 2023-03-04T04:13:47+05:30 IST

తెలంగాణ రాష్ట్ర రైస్‌మిల్లర్ల సంఘం ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్‌ జిల్లాకు చెందిన అన్నమనేని సుధాకర్‌ రావు నియమితులయ్యారు.

రాష్ట్ర రైస్‌మిల్లర్ల సంఘం ప్రధాన కార్యదర్శిగా సుధాకర్‌రావు

హైదరాబాద్‌, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర రైస్‌మిల్లర్ల సంఘం ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్‌ జిల్లాకు చెందిన అన్నమనేని సుధాకర్‌ రావు నియమితులయ్యారు. హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో సుధాకర్‌ నియామకంపై నిర్ణయం తీసుకున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంపా నాగేందర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే కరీంనగర్‌ జిల్లా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా నర్సింగరావు, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా సోమనర్సయ్యను నియమించినట్లు పేర్కొన్నారు.

Updated Date - 2023-03-04T04:14:48+05:30 IST