Telangana : తెలంగాణలో సర్పంచ్‌లకు ఇంకెన్నాళ్లీ బాధలు.. ఆత్మహత్యల దాకా వెళ్తున్నా సర్కార్ పట్టించుకోదేం.. మొన్న అలా.. ఇవాళిలా..!
ABN, First Publish Date - 2023-01-30T18:45:55+05:30
తెలంగాణలో సర్పంచ్‌ల (TS Sarpanch) గోడు వినే నాథుడే లేడా..? ప్రజల కోసం (Public) తమవంతుగా సేవచేయడానికి వచ్చిన..
నిజామాబాద్/హైదరాబాద్ : తెలంగాణలో సర్పంచ్‌ల (TS Sarpanch) గోడు వినే నాథుడే లేడా..? ప్రజల కోసం (Public) తమవంతుగా సేవచేయడానికి వచ్చిన వారిని అడుగడుగునా అధికార పార్టీ నేతలు (BRS Leaders) అడ్డుకుంటున్నారా..? గ్రామాల అభివృద్ధి (Developments) చేయాలనే ఆలోచన సర్పంచ్‌లకు వస్తే.. ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు (MLAs), ఇతర ముఖ్యనేతలకు (Leaders) ఎందుకు మింగుపడట్లేదు..? సర్పంచులపై ఈ రేంజ్‌లో కక్షపూరితంగా ఎమ్మెల్యేలు ఎందుకు వ్యవహరిస్తున్నారు..? గ్రామానికి (Villages) ఇచ్చిన మాటకోసం అప్పులు చేసి మరీ అభివృద్ధి పనులు చేసినా బిల్లుల (Bills) విషయంలో ఎమ్మెల్యేలు ఎందుకు సహకరించట్లేదనే విషయాలపై ప్రత్యేక కథనం.
ఒకటి తర్వాత మరొకటి..!
స్థానిక నేతల వేధింపులు తట్టుకోలోకపోతున్నాం బాబోయ్.. అంటూ మీడియా (Media) ముందుకు వచ్చిన సర్పంచ్‌లు (Sarpanch), కార్పొరేటర్లు (Corporators), ఎంపీటీసీ (MPTC), మున్సిపల్ చైర్ పర్సన్‌లు (Muncipal Chairpersons) ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. ఈ మధ్యనే.. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar) వేధింపులతో తట్టుకోలేకపోతున్నామని జగిత్యాల (Jagtial) మున్సిపల్ చైర్‌పర్సన్ భోగ శ్రావణి (Bhoga Sravani) భోరున ఏడ్చి మీడియా ముందే రాజీనామా (Resign) చేసేశారు. జనవరి 25న ఆమె రాజీనామా చేయగా.. తాజాగా ఆమోదం కూడా లభించింది. ఈ వివాదంపై తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతుండగానే మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA) వేధింపుల బాగోతం వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే వేధింపులు తట్టుకోలేక ఏకంగా సర్పంచ్ దంపతులు ఆత్మహత్యాయత్నమే (Suicide Attempt) చేశారు.
అసలేం జరిగింది..!?
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ (Nizamabad) జిల్లా నందిపేట (Nandipeta) గ్రామ సర్పంచ్ వాణి (Sarpanch Vani).. బీజేపీ (BJP) తరఫున గెలిచి బీఆర్ఎస్ (BJP to BRS) తీర్థం పుచ్చుకున్నారు. అధికార పార్టీలో చేరితే తనను నమ్మి ఓట్లేసి గెలిపించిన గ్రామాన్ని అభివృద్ధి (Village Develoment) చేయాలని భావించారు. అయితే పాలకమండలి మాత్రం వాణికి ఏ మాత్రం సహకరించట్లేదనే ఆరోపణలున్నాయి. ఇదంతా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (MLA Jeevan Reddy) కనుసన్నల్లోనే జరుగుతోందని వాణి ఆరోపిస్తున్నారు. అటు పాలకమండలి సహకరించకపోవడం.. ఇటు జీవన్ రెడ్డి బిల్లుల విషయంలో వేధింపులతో విసిగిపోయిన వాణి.. తన భర్తతో కలిసి నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు (Nizamabad Collectorate) ఆత్మహత్యాయత్నం చేశారు. దంపతులిద్దరూ (Wife and Husband) ఒంటిపై పెట్రోల్ (Petrol) పోసుకుని నిప్పటించుకునే ప్రయత్నం చేశారు. స్థానిక సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు.
ఎందుకిలా..!
బీఆర్ఎస్‌లో చేరిన తర్వాత వాణి (Sarpanch Vani).. కోట్ల రూపాయిలు (Crores Of Amount) అప్పులు తెచ్చి మరీ పంచాయితీలో అభివృద్ధి (Village Development) పనులు చేశారు. తెచ్చిన డబ్బులకు వడ్డీ.. కలిపితే మూడు కోట్లకుపైగానే అవుతోంది. బిల్లులు (Bills) రాకపోవడంతో వాణి దంపతులు అప్పుల్లో కూరుకుపోయారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులిచ్చిన వారు డబ్బులు అడగడంతో తమపై ఒత్తిడి పెరిగిపోయిందని చెబుతున్నారు. దీంతో ఏం చేయాలో దిక్కు తోచక తీవ్ర మనస్థాపంతో ఇలా చేయాల్సి వచ్చిందని మీడియా ముందు కన్నీరుమున్నీరయ్యారు. బిల్లులు మంజూరు చేయడంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకరించట్లేదని (MLA Jeevan Reddy) సర్పంచ్ దంపతులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం జరిగేవరకు ఇక్కడ్నుంచి కదిలేది లేదని కలెక్టరేట్ (Collectorate) ఎదుట ధర్నాకు దిగారు. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు యత్నించగా (Suicide Attempt) పోలీసులు (Police) అడ్డుకున్నారు.
ఇలా ఒక్కచోటే కాదు..!
తెలంగాణలో ఇలాంటి ఘటనలు జరగడం ఇదేం మొదటిసారి కాదు. సర్పంచులు ఆత్మహత్యకు యత్నించిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఆ మధ్య రంగారెడ్డి (Rangareddy) జిల్లాలోని కాశగూడెం గ్రామానికి ఏకగ్రీవంగా ఎన్నికైన యువ సర్పంచ్ షేక్ అజారుద్దీన్ ఆకస్మాత్తుగా ఆత్మహత్య (Suicide) చేసుకున్నారు. అంతేకాదు.. మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లాలోని రఘుమాపూర్ గ్రామ సర్పంచ్ ఝాన్సీ కూడా ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఇద్దరి ఆత్మహత్యయత్నానికి కారణం ఆ గ్రామాల్లో జరగుతున్న లేదా జరగాల్సిన అభివృద్ధి పనులేనని వారి అనుచరులు చెబుతున్నారు.
ఇకనైనా మార్పు వచ్చేనా..!
వాస్తవానికి.. సర్పంచ్‌లకు మంచి పేరు (Good name) తెచ్చేవి అభివృద్ధి పనులే. అలాంటివి ఇప్పుడు వారికి శాపంగా మారాయి. తెలంగాణలో పలు గ్రామాల సర్పంచ్‌లు అభివృద్ధి పనులు చేయలేక.. చేసిన పనులకు బిల్లులు రాక నిత్యం నరకం చూస్తున్నారు. అభివృద్ధి అనే పరువు ప్రతిష్టల సమస్యలు, కష్టపడి గెలుచుకున్న పదవి పోతుందన్న బాధతో తీవ్ర వేధనను అనుభవిస్తూ ఆత్మహత్యాయత్నం చేస్తున్నారు. తెలంగాణలో నెలకొన్న సర్పంచుల సమస్యలపై ప్రభుత్వం (TS Govt) ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరీ ముఖ్యంగా వేరే పార్టీ నుంచి అధికార పార్టీలోకి (Ruling Party) వచ్చిన సర్పంచులపై కక్షపూరిత ఘటనలు మానుకోవాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. ఇకనైనా సర్పంచుల బిల్లులు పెండింగ్ లేకుండా చూసి.. ఎమ్మెల్యేలను ప్రభుత్వ పెద్దలు హెచ్చరిస్తారో లేకుంటే చూసిచూడనట్లు వదిలేస్తారో వేచి చూడాలి మరి.
Updated Date - 2023-01-30T19:00:59+05:30 IST