ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Adani-Andhra Pradesh: అదానీ కహానీ!

ABN, Publish Date - Jul 03 , 2024 | 05:27 AM

నేల, నీరు, నింగి.. అదానీకే జీ హుజూరనేలా వైసీపీ ప్రభుత్వం నడిచిందని ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ నేతలు ఆరోపించారు.

Adani

  • నాడు విపక్షంలో ఉండగా అక్రమాలపై తీవ్ర ఆరోపణలు

  • నేడు అధికారంలోకి.. ఇప్పుడేం చేస్తారో..

  • అదానీ నుంచి ఏపీ రక్షణకు పోరాడిన టీడీపీ

  • ఐదేళ్లూ ప్రత్యక్ష ఉద్యమాలు, న్యాయ పోరాటం

  • మరిప్పుడు ‘గత తప్పులు’ దిద్దుతారా?

  • నాడు అదానీ భోజ్యంలా నడిచిన జగన్‌ రాజ్యం

  • అదానీ కన్నుపడిన ప్రతి వనరూ రాసిచ్చేశారు

  • తిరిగి అదానీ నుంచే అధిక ధరకు కొనే దుస్థితి

  • మధ్యప్రదేశ్‌ బొగ్గు బ్లాక్‌లో మునిగిన ఏపీ జెన్కో

  • ఈ బ్లాక్‌లో అదానీకి రూ.2300కే మెట్రిక్‌ టన్ను

  • తిరిగి దాన్నే రూ.15 వేలకు కొంటున్న జెన్కో

  • పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుల పేరుతో భూపందేరం

  • నాటి ఒప్పందాలు సమీక్షించకుంటే ఆర్థిక దివాలే

  • చంద్రబాబు తీసుకునే చర్యలపైనే సర్వత్రా ఆసక్తి

రైతులకు అన్యాయం

‘‘అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలో అదానీ గ్రూపు ఏర్పాటుచేస్తున్న సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు కోసం 15 వేల ఎకరాలను భూసమీకరణ పద్ధతిలో ప్రభుత్వం సేకరిస్తోంది. అయితే, ఆ భూములకు సంబంధించి రైతులకు లీజు చెల్లింపుపై మాత్రం జగన్‌ సర్కారు ఎటువంటి హామీ ఇవ్వడం లేదు’’

- అక్టోబరు 28, 2022న టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు, అనంతపురం

గంగవరం పోర్టులో క్విడ్‌ప్రోకో

‘‘విశాఖ కాపులుప్పాడలో 89ఎకరాలు, నక్కపల్లిలో 120 ఎకరాలు, చోడవరంలో 100 ఎకరాలు అదానీ డేటా కంపెనీకి విక్రయించడంలో క్విడ్‌ప్రోకో దాగిఉంది. అదానీ గ్రూపు మొదట ఆ భూమి విలువలో 10 శాతం చెల్లించేలా, ఆ తర్వాత మూడు నుంచి ఏడేళ్లలోపు మిగతా మొత్తం ఇచ్చేవిధంగా ఒప్పందం చేసుకోవడం ఏమిటి? జగన్‌, అదానీ కుమ్మక్కుకు ఇదే నిదర్శనం’’

- నవంబరు 27, 2022న బండారు సత్యనారాయణ, పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ

నేల, నీరు, నింగి.. అదానీకే జీ హుజూరనేలా వైసీపీ ప్రభుత్వం నడిచిందని ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ నేతలు ఆరోపించారు. అస్మదీయులకు, అదానీకే అన్ని కాంట్రాక్టులు కట్టబెడుతున్నారన్న ఆవేదనతో గొంతు కలిపారు. రాష్ట్ర సంపదను అదానీ బారి నుంచి కాపాడుకోవాలని ఆందోళనల బాట పట్టారు. విలువైన ఖనిజాలను, పర్యావరణాన్ని పరిరక్షించాలనిసుప్రీంకోర్టు వరకు వెళ్లి న్యాయ పోరాటాలు చేశారు. జగన్‌ అండ చూసుకుని విద్యుత్‌ సంస్థలను అదానీ గుల్లచేసేశారనీ, గంగవరం పోర్టును గుప్పిట్లో పెట్టుకుని విశాఖ స్టీల్‌ ప్లాంటును ముంచేయాలని చూస్తున్నారని ఐదేళ్లూ గట్టిగా నినదించారు. మరి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వమే రాష్ట్రంలో అధికారంలో ఉంది. మరి అదానీ అక్రమాల కథకు తెర దించుతారా?


(అమరావతి, విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి): అడ్డగోలుగా అదానీకి రూ.వేల కోట్ల విలువైన కాంట్రాక్టులను నాడు జగన్‌ అప్పగించారు. నిబధనలు తుంగలో తొక్కి వందల ఎకరాల భూములు రాసి ఇచ్చేశారు. ఇంతా చేస్తే.. అదానీ వల్ల రాష్ట్రానికి పైసా పెట్టుబడి రాలేదు. కొత్తగా యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలూ అందలేదు. కొత్త ప్రభుత్వం ఈ కాంట్రాక్టుల వ్యవహారంపై ఏం చర్య తీసుకుంటుంది? ఏ ప్రాతిపదికన అన్ని వందల ఎకరాలు అదానీకి గత ప్రభుత్వం కేటాయించిందనేదీ చంద్రబాబు ప్రభుత్వం నిగ్గు తేల్చి ప్రజల ముందు నిజాలు ఉంచుతుందా లేదా? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

డేటా లేదు.. ఉపాధీ లేదు..

అదానీ గ్రూపునకు డేటా సెంటర్‌ పేరుతో మధురవాడలో ఏకంగా ఒక కొండను కట్టబెట్టారు. ఆ కొండపై మొత్తం 270 ఎకరాలు ఉండగా...దశల వారీగా మొత్తం అదానీకి ఇచ్చేశారు. రూ.22 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి, ఏడేళ్లలో 40 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అదానీ ఒప్పందం చేసింది. 200 మెగావాట్ల సామర్థ్యంతో ఒక డేటా సెంటర్‌ కాగా, 100 మెగావాట్ల సామర్థ్యంతో మరో డేటా సెంటర్‌ నిర్మించాల్సి ఉంది. సింగపూర్‌ నుంచి విశాఖపట్నం వరకు సముద్ర మార్గం గుండా సబ్‌మెరైన్‌ కేబుల్‌ వేస్తారని, ఇంటర్నెట్‌ వేగం పుంజుకుంటుందని, విశాఖపట్నం ఎక్కడికో వెళ్లిపోతుందని శంకుస్థాపన సమయంలో జగన్మోహన్‌రెడ్డి మాటలు కోటలు దాటించారు. కానీ, డేటా సెంటర్ల ఊసే లేదు. ఇలా రాష్ట్ర ప్రయోజనాలను సొంత ప్రయోజనాల కోసం అదానీకి జగన్‌ తాకట్టు పట్టేశారు.


అదానీ చేతికి పోర్టులు..

విశాఖ ఉక్కుకు అనుసంధానంగా ప్రైవేటు ఆధ్వర్యంలో ఏర్పాటైన గంగవరం పోర్టులో మేజరు వాటాను నయానో భయానో అదానీ లాక్కుంది. ఇక అందులో మిగిలిన ఏపీ ప్రభుత్వ వాటా 10.39 శాతాన్ని కూడా జగన్‌ సర్కారు అదానీకి కట్టబెట్టింది. అది కూడా కేవలం రూ.645 కోట్లకు. మరోవైపు కృష్ణపట్నం పోర్టు అదానీకి ఇచ్చేసింది. ఆ పోర్టు సమీపంలోని దామోదరం సంజీవయ్య ఽథర్మల్‌ పవర్‌ జనరేషన్‌ ప్రాజెక్టును కూడా కట్టబెట్టాలని అప్పట్లో జగన్‌ భావించారు. థర్మల్‌ యూనిట్‌ ఉద్యోగుల పోరు, వారికి అందిన ‘‘ఆంధ్రజ్యోతి’’ సహకారంతో .. కృష్ణపట్నం థర్మల్‌ యూనిట్‌ను అదానీకి అప్పగించడం జగన్‌కు వీలు కాలేదు.

కారుచౌకగా మధ్యప్రదేశ్‌ బొగ్గు బ్లాక్‌

మధ్యప్రదేశ్‌లోని సింగ్రోలి జిల్లా సులియారిలోని ఏపీఎండీసీ కోల్‌మైన్స్‌లో అత్యంత కీలకమైన బొగ్గు నిక్షేపాలు లభ్యమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ విధానం ప్రకారం ..నేరుగా బొగ్గు నిక్షేపాలను విక్రయించకుండా వేలం ద్వారా అమ్మాల్సి ఉంది. ఈ వేలంలో రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (ఏపీ జెన్కో) పాల్గొనాల్సి ఉంది. కానీ ఆ సంస్థ పాల్గొనేందుకు అప్పట్లో జగన్‌ ప్రభుత్వం అంగీకరించలేదు. అదానీకి మేలు చేసేలా ఆయన వ్యవహరించారు. విదేశీ బొగ్గుతో సమానమైంది మధ్యప్రదేశ్‌ బొగ్గు. దీనిని అదానీకి మెట్రిక్‌ టన్నుకు రూ.2300కే కట్టబెట్టారు. రాష్ట్ర అవసరాల కోసం విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్న ఏపీజెన్కో మాత్రం .. అదానీ నుంచి టన్ను బొగ్గు రూ.8వేలునుంచి రూ.15వేలు దాకా చెల్లించి కొనుగోలు చేస్తోంది.


రూ. లక్ష కోట్ల విద్యుత్‌ భారం..

రాజస్థాన్‌లోని అదానీ సోలార్‌ విద్యుత్తు ప్లాంటు నుంచి సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ద్వారా ఏడువేల మెగావాట్ల విద్యుత్తును యూనిట్‌కు రూ.2.49 చొప్పున కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ఒప్పందం చేసుకుంది. దీనివల్ల రాష్ట్ర ప్రజలపై 25 ఏళ్లలో లక్ష కోట్ల రూపాయల పెను భారం పడే ప్రమాదం ఉంది.

సిమెంట్‌ ఫ్యాక్టరీల జాడేదీ?

కడప, నడికుడిలో పది మిలియన్‌ టన్నుల సామర్థ్యం కలిగిన సిమెంట్‌ ఫ్యాక్టరీలను అదానీ సంస్థ ఏర్పాటు చేస్తుందని అప్పట్లో ీజగన్‌ వెల్లడించారు. 2022లో ఒప్పందాలు చేసుకున్నా.. ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు.

కన్ను పడితే అంతే..

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రిజర్వాయర్లను అదానీకి జగన్‌ ధారాదత్తం చేసేశారు. జగన్‌ సొంత జిల్లా కడపలో గండికోట రిజర్వాయరుపై 1000 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ జలవిద్యుత్తు ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు అదానీకి అప్పటి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారు. దీనికోసం ఎకరం రూ.5 లక్షలు చొప్పున 36వేల ఎకరాలను అందించేందుకు సిద్ధమయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లాలో చిత్రావతిపై నిర్మించిన రిజర్వాయర్‌ను ఆధారం చేసుకుని 500 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ జల విద్యుత్తు ప్రాజెక్టు కోసం మూడువేల ఎకరాలను ఎకరా ఐదు రూ.లక్షలు చొప్పున అప్పగించేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని కరుకుర్తిలో 1200 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ జల విద్యుత్తు ప్రాజెక్టు కోసం ఎకరా రూ.ఐదు లక్షలు చొప్పున 7200 ఎకరాలను రాసిచ్చేశారు. పార్వతీపురం మన్యంలోని కర్రివలసలో 1000 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ జల విద్యుత్తు ప్రాజెక్టుకు కూడా ఎకరా రూ.ఐదు లక్షలు చొప్పున ఆరువేల ఎకరాలు ఇచ్చేశారు. ఇక్కడ పనులు ఇప్పటిదాకా ముందుకు సాగలేదు.

అదానీ కా బాత్‌... కమీషన్ల కోసమే పోర్టు ఇచ్చేశారు..

‘‘కమీషన్ల కోసం జగన్‌... ఆదానీకి గంగవరం పోర్టు ధారాదత్తం చేశారు. పోర్టు నిర్మించిన పొలాల్లో రైతుల డిమాండ్లను అదానీ గ్రూపు పట్టించుకోలేదు.’’

- ఏప్రిల్‌ 22, 2024న టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి

టెర్మినల్‌ తరలింపు రాష్ట్రానికి నష్టదాయకం..

‘‘ప్రతిష్ఠాత్మకమైన కృష్ణపట్నం కంటైనర్‌ టెర్మినల్‌ తమిళనాడుకు తరలిపోవడం రాష్ట్రానికి నష్టదాయకం. దీనివల్ల కృష్ణపట్నం పోర్టుపై ఆధారపడిన లక్షమంది ఉపాధి కోల్పోతారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.1000 కోట్లు ఆదాయం కోల్పోతుంది.’’

- జనవరి 21, 2024న టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jul 03 , 2024 | 09:40 AM

Advertising
Advertising