Amaravati : ప్రక్షాళన ఆరంభం
ABN, Publish Date - Jul 10 , 2024 | 03:21 AM
గత ఐదేళ్ల కాలంలో జగన్‌తో అంటకాగి.. ఐఏఎస్ అధికారులమన్న మాటే మరచి.. ఫక్తు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరించిన అధికారులపై వేటు మొదలైంది. జగన్ హయాంలో తానే సూపర్ సీఎం అన్నట్లుగా.. నియంతను తలపించేలా ప్రవర్తించిన సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ...
జగన్ వీరవిధేయులపై కొరడా.. సీనియర్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాశ్‌తో మొదలు
ఆయన వీఆర్‌ఎస్‌కు ప్రభుత్వం ఓకే.. 3 నెలల
నోటీసు గడువు ఇంకా ఉండగానే ఉత్తర్వులు
మిగతావారికి గట్టి హెచ్చరిక పంపేందుకే!
వ్యవస్థలను భ్రష్టుపట్టించినవారిపై ఆరా
మూడొంతుల మంది ఇలాంటివారే!
అంతమందిని తప్పించాలంటే ఐఏఎ్‌సల కొరత
అందుకే జల్లెడ పట్టి పరిమిత సంఖ్యలో చర్యలు!
త్వరలో మరో ఇద్దరు ముగ్గురికి ఉద్వాసన?
(అమరావతి-ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్ల కాలంలో జగన్‌తో అంటకాగి.. ఐఏఎస్ అధికారులమన్న మాటే మరచి.. ఫక్తు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరించిన అధికారులపై వేటు మొదలైంది. జగన్ హయాంలో తానే సూపర్ సీఎం అన్నట్లుగా.. నియంతను తలపించేలా ప్రవర్తించిన సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్‌కు చంద్రబాబు ప్రభుత్వం ఉద్వాసన పలికింది. స్వచ్ఛంద పదవీవిరమణ (వీఆర్‌ఎస్) కోరుతూ ఆయన పెట్టుకున్న దరఖాస్తును మంగళవారం ఆమోదించేసింది. ఈయన అత్యంత వివాదాస్పదుడు.. ఒక్క అధికారితోనూ సఖ్యత ఉండదు. జగన్ అధికార పగ్గాలు చేపట్టగానే ఢిల్లీ నుంచి ఈయన్ను పిలిపించి తన పేషీలో నియమించుకున్నారు. కీలకమైన సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కూడా అప్పగించారు. ఇక అంతే.. సర్వం తానే అన్నట్లు వ్యవహరించారు. విచ్చలవిడితనం పెరిగిపోయింది. సీనియర్ ఐఏఎస్ అధికారులను కూడా లక్ష్యపెట్టని స్థితికి చేరుకున్నారు.
Also Read: జులై 13 వరకు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ అలర్ట్
నిబంధనలను అతిక్రమించి రెండు సార్లు ఎన్నికల సంఘం ఆగ్రహానికి గురైన ఈయన.. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నప్పుడు టీచర్లను వేధించుకు తిన్నారు. పాఠశాలలు సందర్శించి.. టీచర్లను పిల్లల ముందే గద్దించడం.. అకారణంగా సస్పెండ్ చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. కొత్త ప్రభుత్వం రాగానే ఆయన్ను బదిలీచేసి పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. దీంతో ఆయనకు పరిస్థితి అర్థమైపోయింది. తాను చేసిన అకార్యాలకు శిక్ష తప్పదని గ్రహించారో ఏమో.. వీఆర్‌ఎ్‌సకు దరఖాస్తు చేసుకుని.. మూడు నెలల నోటీసు ఇచ్చారు. సెప్టెంబరు 30తో నోటీసు గడువు ముగుస్తుంది. అది ముగిసే ముందు వీఆర్‌ఎ్‌సను ఆమోదిస్తున్నట్లు ప్రభుత్వం జీవో ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పుడే ఉత్తర్వులివ్వడం గమనార్హం. దీనర్థం ఈ మూడు నెలల్లో ఆయనకు పోస్టింగ్ కూడా ఇవ్వరన్న మాట. ఆయనలా జగన్ కోసం పనిచేసిన ఇంకొందరు అధికారులకు గట్టి హెచ్చరిక సందేశం పంపేందుకే చంద్రబాబు ప్రభుత్వం ఇలా చేసింది.
దారి తప్పినోళ్లు ఎందరో..
జగన్ ఐదేళ్ల హయాంలో చాలా మంది ఐఏఎ్‌సలను నయానో భయానో లొంగదీసుకున్నారు. కొందరు సీనియర్ అధికారుల మెడపై కత్తిపెట్టి తమకు కావలసిన పనులు చేయించుకున్నారు. తప్పుడు కేసులు, అరెస్టులకు కొందరు అధికారులు భయపడి ఆయన చెప్పినట్టల్లా చేసి అభాసుపాలయ్యారు. కొత్త ప్రభుత్వం వచ్చాక వీరందరిపై వేటు పడుతుందని అందరూ భావించారు. వైసీపీ కార్యకర్తల్లా పనిచేసిన అధికారులు ఎవరా అని లెక్కదీస్తే.. మూడొంతుల మంది జగన్‌తో అంటకాగారని తేలింది. ఇంత మందిని తప్పించడం కుదిరే పనికాదు.
Also Read: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు
అసలే రాష్ట్రంలో ఐఏఎస్‌ల కొరత ఉంది. దీనికితోడు జగన్ అనాలోచితంగా 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతో 13 మంది చొప్పున కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లను నియమించాల్సి వచ్చింది. దీంతో ఐఏఎ్‌సల కొరత మరింత పెరిగింది. ఈ పరిస్థితుల్లో మూడొంతుల మందిని పక్కనపెట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం వెనుకాడుతోంది. అందుకే ఈ జాబితాను వడపోసి.. వ్యవస్థలను అతలాకుతలం చేసిన సీనియర్లపై తొలుత దృష్టి సారించింది. పరిమిత సంఖ్యలో ఒక్కొక్కరినీ సాగనంపేందుకు సమాయత్తమైంది. ఇందులో భాగంగానే ప్రవీణ్ ప్రకాశ్‌పై మొదటి వేటుపడింది. ఇలాంటివారిని లూప్‌లైన్‌లో ఉంచినా.. ఎక్కడో ఒక చోట పోస్టింగ్ ఇవ్వాల్సిందేనని.. అక్కడ కూడా వ్యవస్థను నాశనం చేస్తారని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే పూర్తిగా నీతి తప్పినవారిని మాత్రమే ఏరివేయాలని అనుకుంటోంది. అతిత్వరలోనే ఇద్దరు ముగ్గురిపై ఈ దిశగా చర్యలుంటాయని తెలుస్తోంది.
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Jul 10 , 2024 | 08:05 AM