Share News

Anam Venkata Reddy: ‘రోజక్కకి ఇంకా సిగ్గు రాలేదు’

ABN , Publish Date - Sep 05 , 2024 | 04:22 PM

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. పనికి మాలిన మాటలు మాట్లాడే రోజక్కకు ఇంకా సిగ్గు రాలేదన్నారు. తిరుమలను దోపిడి చేసిన రోజాకు ప్రోటోకాల్ దర్శనం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.

Anam Venkata Reddy: ‘రోజక్కకి ఇంకా సిగ్గు రాలేదు’

నెల్లూరు, సెప్టెంబర్ 05: వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. పనికి మాలిన మాటలు మాట్లాడే రోజక్కకు ఇంకా సిగ్గు రాలేదన్నారు. తిరుమలను దోపిడి చేసిన రోజాకు ప్రోటోకాల్ దర్శనం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓడినా రోజాకు మాత్రం బుద్ది రాలేదని చెప్పారు.

పార్టీ శ్రేణులను విస్మరించి రోజక్క ఇటలీలో కూర్చుందంటూ ఆయన వ్యంగ్యంగా అన్నారు. తిరుమలలో దైవదర్శనానికి వెళ్లి ఆర్కే రోజా రాజకీయాలు మాట్లాడుతుందని మండిపడ్డారు. రోజా ఇంకా మారలేదన్నారు. అనవసర విమర్శలు చేస్తే తగిన బుద్ది చెబుతామంటూ ఈ సందర్భంగా ఆర్కే రోజాకు ఆనం వెంకట రమణారెడ్డి హెచ్చరించారు.

Hyderabad: జూబ్లీహిల్స్‌లో పలు రెస్టారెంట్లపై దాడులు.. కేసులు నమోదు


అధికారంలో ఉన్న సమయంలో మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన నాటి వైసీపీ మంత్రులు.. మాజీలుగా మారిన తర్వాత కనిపించకుండా పోయారని ఎద్దేవా చేశారు. గురువారం నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆనం వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ.. తన నాయకుడు నారా లోకేశ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారన్నారు.

ఏ విషయాన్ని అయినా.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పేపర్ చూసి చదువుతారని ఈ సందర్భంగా ఆనం గుర్తు చేశారు. ఇప్పటికైనా రాష్ట్రంపై అవగాహాన తెచ్చుకోవాలంటూ మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఆనం హితవు పలికారు.

Vinayaka Chavithi Special 2024: ముస్లిం దేశాల్లో పూజలందుకొంటున్న ‘గణపతి’


నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో కుంభకోణం..

ఇక నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్‌లో జరిగిన ఫోర్జరీ సంతకాల కుంభకోణంపై జిల్లా కలెక్టర్ ఆనంద్‌కి ఫిర్యాదు చేశామన్నారు. ఆయనకు ఆధారాలు సైతం అందజేసినట్లు వివరించారు. నెల్లూరు కార్పోరేషన్‌లో చోటు చేసుకున్న ఈ మార్టుగేజ్ ఫోర్జరీ సంతకాల కుంభకోణంలో తవ్వే కొద్ది అక్రమాలు బయటకొస్తున్నాయన్నారు. ఈ అంశంపై పోలీసులు మాత్రం దృష్టి సారించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


అంతేకాదు.. ఈ కేసు విచారణను పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పోరేషన్‌కి సంబంధం లేకుండా బయట వ్యక్తులు మార్టిగేజ్ రిలీజ్ చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ అంశంపై త్వరలో హైకోర్టుని సైతం ఆశ్రయిస్తామని ఆనం స్పష్టం చేశారు. కార్పొరేషన్‌లో చోటు చేసుకున్న కుంభకోణంపై సీఐడీతో విచారణ జరిపిస్తే కానీ అస్సలు దోషులు వెలుగులో రారని ఆనం పేర్కొన్నారు.


ఈ కేసు నుంచి రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేషన్‌లో చోటు చేసుకున్న అవినీతి అంతా ఓ పథకం ప్రకారమే జరిగిందని ఆనం వెంకటరమణా రెడ్డి విమర్శించారు.

Read Latest AP News and Telugu News

Updated Date - Sep 05 , 2024 | 06:53 PM