Rural Roads : పల్లె రోడ్ల ప్రగతి ఇంతేనా?
ABN, Publish Date - Apr 30 , 2024 | 12:45 AM
అధికారం చేతిలో ఉన్నా సొంతూరి చుట్టు పట్ల గ్రామాలకు తారురోడ్డు వేయించుకోలేకపోయాడనే విమర్శలు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి మూటగట్టుకున్నాడు. ఆత్మకూరు మండలంలో బి. యాలేరు నుంచి తగరకుంట వరకూ డబుల్‌లేన తారు రోడ్డు నిర్మాణం చేయుటకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా కాంట్రాక్టర్ ఆ పనులు అరకొరగా చేశారు. కల్వర్టుల...
పూర్తికాని గ్రామీణ రహదారుల పనులు
పట్టించుకోని కాంట్రాక్టర్
కంకర రోడ్లపై ప్రయాణికుల ఇబ్బందులు
రాప్తాడు ఎమ్మెల్యే ఇలాఖాలో రోడ్ల దుస్థితి
అధికారం చేతిలో ఉన్నా సొంతూరి చుట్టు పట్ల గ్రామాలకు తారురోడ్డు వేయించుకోలేకపోయాడనే విమర్శలు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి మూటగట్టుకున్నాడు. ఆత్మకూరు మండలంలో బి. యాలేరు నుంచి తగరకుంట వరకూ డబుల్‌లేన తారు రోడ్డు నిర్మాణం చేయుటకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా కాంట్రాక్టర్ ఆ పనులు అరకొరగా చేశారు. కల్వర్టుల నిర్మాణ పనులు పూర్తి చేసి కొంత దూరం మాత్రమే తారు రోడ్డు వేసి మమ అనిపించారు. నిత్యం ఆదారి గుండా ప్రయాణించే వాహనదారులు రోడ్డు సక్రమంగా ఎప్పుడు పూర్తి చేస్తారోనని ఎదురు చూస్తున్నారు. - రాప్తాడు
ఏళ్లు గడుస్తున్నా 6 కి.మీ తారు రోడ్డే
ఆత్మకూరు మండలంలోని బి. యాలేరు నుంచి సనప, రంగం పేట, తోపుదుర్తి రాప్తాడు మండలంలోని పాలచెర్ల, భోగినేపల్లి కనగానపల్లి మండలంలోని తగరకుంట గ్రామం వరకూ గతంలో సింగల్‌లేన తారు రోడ్డు ఉండేది. రోడ్డు అక్కడక్కడా గుంతలమయంగా ఉండేది. వైసీపీ అధికారంలోకి వచ్చాక బి. యాలేరు నుంచి తగరకుంట వరకూ 25 కి.మీ డబుల్‌లేన తారురోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం ఆర్‌అండ్‌బీకి రూ. 52 కోట్లు నిధులు మంజూరు చేసింది. డబుల్‌లేన తారురోడ్డు నిర్మాణం చేయాలని గతంలో నిర్మించిన సింగల్‌లేన తారురోడ్డు తవ్వేసి కంకర వేశారు. కొన్ని చోట్ల పాత తారురోడ్డు తొలగించ కుండా అలాగే ఉంచారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2021లో పనులు ప్రారంభించి 2023లోగా పూర్తి చేయాలి. కాంట్రాక్టర్ మొదటి నుంచి నత్తనడకన పనులు చేశారు. యాలేరు నుంచి తగరకుంట వరకూ కల్వర్టుల
నిర్మాణం, కంకర పరిచేందుకే దాదాపు ఏడాదిన్నర పట్టింది. ఆ తరువాత రోడ్డు పనులు ప్రారంభించారు. యాలేరు నుంచి సనప మీదుగా రంగంపేట వరకూ 6 కి.మీ మాత్ర మే డబుల్‌లేన తారురోడ్డు నిర్మించారు. రంగంపేట నుంచి తోపుదుర్తి వరకూ డబుల్‌లేన తారురోడ్డు వేయలేదు. గతంలో నిర్మించిన సింగల్‌లేన తారు రోడ్డు అలాగే ఉంది. తోపుదుర్తి నుంచి పాలచెర్ల, భోగినేపల్లి, తగరకుంట వరకూ రోడ్డే వేయలేదు. గతంలో ఉన్న సింగల్‌లేన తారు రోడ్డు తొలగించి కంకర వేసి వదిలేశారు. కంకర పరచిన దారిలో వెలుతూ నిత్యం వాహనదారులు ఇబ్బంది పడుతు న్నారు.
ఇంకెప్పుడు పూర్తి చేస్తారో?
రోడ్డు పనులు ప్రారంభించి రెండేళ్లవుతున్నా 25 కి.మీ తారు రోడ్డు కూడా నిర్మించలేకపోతున్నారని వాహనదారులు అసహ నం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామాలకు వెళ్లే రోడ్లకు ఎప్పుడు మోక్షం కలుగుతుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రకా్‌షరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నా తన సొంతూరు చుట్టు పక్కల గ్రామాలకు నిధులు మంజూరైనా రోడ్డు వేయించలేకపోతు న్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తారు రోడ్డు నిర్మించాలి: ఉజ్జినప్ప, సర్పంచ, భోగినేపల్లి
అనంతపురం నుంచి తోపుదుర్తి మీదుగా మా గ్రామానికి సింగల్‌లేన తారు రోడ్డు ఉండేది. డబుల్‌లేన తారు రోడ్డు నిర్మిస్తామని రెండేళ్ల కిందట ఉన్న రోడ్డును తొలగించి కంకర వేశారు. అప్పటి నుంచి తారు రోడ్డు వేయలేదు. కల్వర్టులు మాత్రమే పూర్తి చేశారు. కంకర తేలిన దారిలో వెళ్లేందుకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు నిర్మాణం వెంటనే పూర్తి చేయాలి.
ఉన్న రోడ్డు తొలగించారు: రాము, భోగినేపల్లి
డబుల్‌లేన తారు రోడ్డు నిర్మిస్తామని గతంలో ఉన్న సింగల్‌లేన తారు రోడ్డు తొలగించారు. కంకర వేసి వదిలేశారు. రోడ్డు వేయకుండా కాలయాపన చేస్తున్నారు. పాలచెర్ల, భోగినేపల్లి, తగరకుంట గ్రామాల ప్రజలు అనంతపురం, రాప్తాడుకు వెళ్లాలంటే తోపుదుర్తి మీదుగానే వెళ్లాలి. కంకర తేలిన దారిలో రాకపోకలు సాగించేందుకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
త్వరలోనే పూర్తి చేస్తాం
అనివార్య కారణాల వలన రోడ్డు తారు రోడ్డు నిర్మాణం ఆసల్యమైంది. త్వరలోనే రోడ్డు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం.
- ప్రసాద్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Apr 30 , 2024 | 12:45 AM