ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MP Baireddy Sabari: తిరుపతి లడ్డూను అపవిత్రం చేసిన వారిని ఉరితీసిన తప్పులేదు

ABN, Publish Date - Sep 20 , 2024 | 07:21 PM

. తిరుపతి లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు, చేప నూనె వాడటం మహా పాపం అని ఎంపీ బైరెడ్డి శబరి ఆరోపించారు. తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిని ఎంపీ బైరెడ్డి శబరి ఉరితీసిన తప్పులేదని హెచ్చరించారు.

నంద్యాల: వైసీపీ ప్రభుత్వంలో తిరుపతి లడ్డూను అపవిత్రం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఈవిషయంపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి స్పందించారు. వైసీపీ ప్రభుత్వం, మాజీ సీఎం జగన్‌రెడ్డిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తిరుమల వెంకన్న దర్శనం కోసం ప్రపంచవ్యాప్తంగా భక్తులు వస్తారని తెలిపారు. లడ్డూ ప్రసాదం కోసం గంటల తరబడి వేచి ఉండి తీసుకెళ్తారని ఎంపీ బైరెడ్డి శబరి చెప్పారు.


దేవుడంటే నమ్మకం లేని వారిని తీసుకువచ్చి జగన్ తిరుపతిలో పాలన చేయించారని విమర్శించారు. తిరుపతి లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు, చేప నూనె వాడటం మహా పాపమన్నారు. ఆ పాపం జగన్‌‌కే దక్కుతుందని ఆరోపించారు. జగన్ ఐదేళ్ల పాలనలో గుడులకు ప్రాధాన్యత ఇవ్వలేదని అన్నారు. శ్రీశైలం ప్రసాదంలో కూడా ఇటీవలే చికెన్ ముక్క కనిపించిందని ఆరోపించారు. తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిని ఉరితీసిన తప్పులేదని ఎంపీ బైరెడ్డి శబరి హెచ్చరించారు.


జంతువుల అవశేషాలు కట్టుకథలా..

‘‘కట్టుకథలు చెప్పే జగన్‌కు వాస్తవాలు రుచించవు. ల్యాబ్‌లో సాక్ష్యాధారాలతో సహా నెయ్యిలో జంతువుల కొవ్వు వాడారన్న విషయం బట్టబయలైనా జగన్ తీరులో మార్పు రాలేదు. కొవ్వుకు కట్టుకథ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ల్యాబ్ నివేదికలు కట్టుకథలా? జంతువుల అవశేషాలు కట్టుకథలా? చేపనూనె, పందికొవ్వు ఉండటం కట్టుకథా? కట్టుకథలు చెప్పడం ఒక్క జగన్ రెడ్డికే చెల్లింది. సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసులో కట్టుకథలు చెప్పింది జగన్ రెడ్డి కాదా? ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో తిరుపతి వెంకటేశ్వరస్వామిని రోజుకు 30వేలు-40వేల మంది భక్తులు దర్శించుకుంటారు. వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు నెలల తరబడి భక్తులు వేచిచూస్తారు. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి లడ్డూ ప్రసాదం తీసుకుని, ఆ లడ్డూను ఇంటికి తీసుకెళ్లి పూజ చేసి అందరికీ భక్తులు పంచుతారు. హిందువులు గోమాతను దేవతగా కొలుస్తారు. గోమాత మాంసాన్ని నూనెను లడ్డూలో వాడటం దుర్మార్గం, అత్యంత పాపం. తిరుమల తిరుపతి లడ్డూలో వాడే నెయ్యి కల్తీ చేయడం కంటే మరొక పాపం ఉండదు. ఈ పాపం జగన్మోహన్ రెడ్డిదే. హిందుత్వాన్ని నమ్మనివాళ్లు, హిందువులు కాని వారు అయినటువంటి వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలను టీటీడీకి చైర్మన్‌గా చేశారు’’ అని ఎంపీ బైరెడ్డి శబరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


వెంకటేశ్వరస్వామిపై వైసీపీ ప్రభుత్వం జీవో...

‘‘వెంకటేశ్వరస్వామిపై ఒక జీఓను వైసీపీ ప్రభుత్వం తెచ్చింది. 1857లో సిపాయిల తిరుగుబాటు సమయంలో బ్రిటీషు వారు వాడే బుల్లెట్లకు గోమాంసం ఉందని తెలిసి బ్రిటీషు వారిపై విపరీతమైన తిరుగుబాటు మొదలైన ఘట్టం అది. నేడు వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో గోమాంసం ఆనవాళ్లు, చేపనూనె ఉంది అంటే ఏం అనుకోవాలి? వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో హిందూ దేవాలయాలకు గౌరవం, విలువ ఇవ్వలేదు. శ్రీశైలం లడ్డూలో చికెన్ ఎముక వైసీపీ పాలనలో కనిపించిందని నేను చెబితే ఎవరూ పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు కఠిన శిక్ష వేస్తారని ఆశిస్తున్నాను. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతి లడ్డూ క్వాలిటీ ఎలా ఉంది అని ల్యాబ్ టెస్టుకు పంపారు అంటే చంద్రబాబు చిత్తశుద్ధిని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంతకంటే మంచి ప్రభుత్వం ఉంటుందా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా లడ్డూను కల్తీ చేసిన వైసీపీ దుర్మార్గులకు కఠిన శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను’’ అని ఎంపీ బైరెడ్డి శబరి తెలిపారు.

Updated Date - Sep 20 , 2024 | 07:38 PM