ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Anantapur: వారిపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. రంగంలోకి దిగిన స్పెషల్ టీమ్స్..

ABN, Publish Date - Nov 08 , 2024 | 09:59 AM

ఏపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇప్పటికే కడప జిల్లా పోలీసులు అప్రమత్తం కాగా.. వైసీపీ సైకో ఫ్యాక్టరీపై ఉక్కుపాదం మోపేందుకు ఉమ్మడి అనంతపురం జిల్లా పోలీసులు చర్యలు చేపట్టారు. అనంతపురం ఎస్పీ జగదీశ్, శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న సైబర్ నిపుణులతో స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేశారు.

అనంతపురం: సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతూ రెచ్చిపోతున్న వైసీపీ సైకో మూకలపై ఉక్కుపాదం మోపేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనితతోపాటు పలువురు కూటమి అగ్రనేతలపై తప్పుడు ప్రచారం చేసే వారిని కట్టడి చేసేందుకు అధునాతన సాంకేతికతను వినియోగిస్తోంది. రెండ్రోజుల క్రితం జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో సోషల్ మీడియా దుష్ప్రచారంపై పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఏపీలో అత్యున్నత పదవుల్లో ఉన్న వారిని, పార్టీ నేతలను, ఇళ్లల్లో ఉన్న ఆడవారినీ వదలకుండా వైసీపీ మూకలు సోషల్ మీడియాలో కారుకూతలు కూస్తున్నాయని సీఎం చంద్రబాబు దృష్టికి పవన్ తీసుకెళ్లారు.


తప్పుడు ప్రచారం చేసే వారిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్తే కొంత మంది పోలీసులు సైతం పట్టించుకోవడం లేదని డిప్యూటీ సీఎం ధ్వజమెత్తారు. స్వయంగా తానే ఫోన్ చేసినా ఎస్పీలు స్పందించడం లేదని, కచ్చితంగా ఇలాంటి పద్ధతులు మార్చాలని చంద్రబాబును కోరారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి అలాంటి పోలీసు అధికారులపై చర్యలు తీసుకుందామని చెప్పారు. నెల రోజుల్లో అందరినీ సెట్ చేద్దామని అన్నారు. ఈ మేరకు వర్రా రవీంద్రారెడ్డి కేసులో కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌ రాజును ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టిన అతనికి నోటీసు ఇచ్చి వదిలేసినందుకు చిన్నచౌక్‌ సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌ సైతం సస్పెండ్‌ చేసింది.


ఏపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇప్పటికే కడప జిల్లా పోలీసులు అప్రమత్తం కాగా.. వైసీపీ సైకో ఫ్యాక్టరీపై ఉక్కుపాదం మోపేందుకు ఉమ్మడి అనంతపురం జిల్లా పోలీసులు చర్యలు చేపట్టారు. అనంతపురం ఎస్పీ జగదీశ్, శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న సైబర్ నిపుణులతో స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వ పెద్దలు, మహిళా మంత్రులు, వారి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఫేక్ ఐడీలతో పోస్టులు పెట్టినా గుర్తించి పట్టుకునే విధంగా సాంకేతికతను వియోగిస్తున్నారు. అందుకు సంబంధించిన ప్రత్యేక టీమ్‍లను రంగంలోకి దింపారు.


ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాజకీయ పార్టీలు, సామాజిక వర్గాలకు చెందిన 12 వందలకు పైగా సోషల్ మీడియా గ్రూపులపై నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు. ఇప్పటికే తప్పుడు ప్రచారం చేసిన ఆరుగురు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, సానుభూతిపరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక నుంచి ఎవరైనా సరే రాష్ట్ర ప్రభుత్వాన్ని, కూటమి నేతలను, వారి కుటుంబసభ్యులను కించపరిస్తూ వ్యాఖ్యలు చేస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Kurnool: రాయలసీమ వర్సిటీలో దాహం కేకలు...

IT Rides: గ్రంధి శ్రీనివాస్ నివాసంలో మూడవరోజు ఐటీ సోదాలు.. డాక్యుమెంట్లు, నగదు స్వాధీనం..

Updated Date - Nov 08 , 2024 | 09:59 AM