ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP politics: పేట్రేగిపోతున్న వైసీపీ మూకలు.. బెంబేలెత్తుతున్న ఎన్నికల అధికారులు..!

ABN, Publish Date - May 30 , 2024 | 10:10 AM

రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా వైసీపీ(YSRCP) మూకలు చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. ప్రతిపక్షాలపై ఇష్టారాజ్యంగా దాడులు చేసిన అధికార పార్టీ శ్రేణులు... తాజాగా అధికారులపైనా తమ జులుం ప్రదర్శిస్తున్నారు. కొంతమంది ఎన్నికల అధికారులు వైసీపీ నేతలకు అనుకూలంగా ఉన్నారనే వాదనలు కూటమి నేతలు బలంగా వినిపిస్తున్నారు. అయితే తమ మాట వినని అధికారులపై బెదిరింపులకు పాల్పడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని... వీరి ఒత్తిళ్లు తట్టుకోలేక అధికారులు సెలవులు తీసుకుంటున్నారని టీడీపీ నేతలు చెప్తున్నారు.

Andhra Pradesh: రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా వైసీపీ(YSRCP) మూకలు చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. ప్రతిపక్షాలపై ఇష్టారాజ్యంగా దాడులు చేసిన అధికార పార్టీ శ్రేణులు... తాజాగా అధికారులపైనా తమ జులుం ప్రదర్శిస్తున్నారు. కొంతమంది ఎన్నికల అధికారులు వైసీపీ నేతలకు అనుకూలంగా ఉన్నారనే వాదనలు కూటమి నేతలు బలంగా వినిపిస్తున్నారు. అయితే తమ మాట వినని అధికారులపై బెదిరింపులకు పాల్పడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని... వీరి ఒత్తిళ్లు తట్టుకోలేక అధికారులు సెలవులు తీసుకుంటున్నారని టీడీపీ నేతలు చెప్తున్నారు.


అధికారులపైనే బెదిరింపులా..?

ఇలాంటి ఘటనలే అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో వెలుగు చూశాయి. ఈ జిల్లాల్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారులపై వైసీపీ నేతల ఒత్తిళ్లు పెరిగాయి. వీరి పెట్టే ఇబ్బందులు భరించలేకే తాడిపత్రి రిటర్నింగ్ రాంభూపాల్ రెడ్డి అనారోగ్య కారణాలు చూపుతూ సెలవుపై వెళ్లారు. ఇదే బాటలో మరికొంత మంది రిటర్నింగ్ అధికారులూ కలెక్టర్ వద్ద తమ గోడు వెల్లబోసుకున్నారు. ఓట్ల కౌంటింగ్ రోజు తమకు అనుకూలంగా వ్యవరించాలంటూ అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరు ఆగడాలు భరించలేకపోతున్నామని.. తీవ్ర ఒత్తిడితో ఆరోగ్య సమస్యలూ తలెత్తుతున్నారని కలెక్టర్ ఎదుట వాపోయారు.


నెల్లూరులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అధికారులను ఇబ్బందులకు గురి చేస్తూ వారిని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. మాట వినని వారిపై నిర్భయంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. అయితే కొంతమంది అధికార పార్టీతో అంటకాగుతున్నారనే వాదనలూ బలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఉదయగిరి రిటర్నింగ్ అధికారి, సీతారామపురం ఎంపీడీవోపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన భోజనం తిన్నారనే నెపంతో సచివాలయ సిబ్బంది ఒకరిని సస్పెండ్ చేశారన్నారు. కానీ వైసీపీ ఎన్నికల ప్రచారాల్లో బహిరంగంగా పాల్గొన్న అంగన్వాడీలు, కస్తూర్బా కళాశాల సిబ్బంది, రేషన్ డీలర్లపై ఆధారాలతో సహా ఫిర్యాదులు చేసినా రిటర్నింగ్ అధికారి పట్టించుకోలేని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. వైసీపీ ప్రచారాల్లో పాల్గొన్న వారిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు దేశంలో ఎక్కడా లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

For more Andhrapradesh news and Telugu news..

Updated Date - May 30 , 2024 | 10:10 AM

Advertising
Advertising