అభివృద్ధి చేసే పార్టీకి ఓటేయండి
ABN , Publish Date - Apr 29 , 2024 | 12:15 AM
అభివృద్ధికి పాటుపడే టీడీపీకి ఓటువేసి కూటమి అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డిని గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి కుమారుడు విరాజ్‌రెడ్డి ప్రజలను అభ్యర్థించారు. పట్టణంలోని రజకవీధిలో ఆదివారం ఇంటింటికి తిరిగి ప్రజలను టీడీపీకి ఓట్లు వేయాలని కోరారు.
డిపత్రిటౌన, ఏప్రిల్ 28: అభివృద్ధికి పాటుపడే టీడీపీకి ఓటువేసి కూటమి అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డిని గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి కుమారుడు విరాజ్‌రెడ్డి ప్రజలను అభ్యర్థించారు. పట్టణంలోని రజకవీధిలో ఆదివారం ఇంటింటికి తిరిగి ప్రజలను టీడీపీకి ఓట్లు వేయాలని కోరారు. సూపర్‌సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రచారంలో కౌన్సిలర్ జింకా లక్ష్మిదేవి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
టీడీపీ ఎంపీ అభ్యర్థిని కలిసిన మండల నాయకులు
పుట్లూరు: టీడీపీ ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణను ఆదివారం మండల నాయకులు అనంతపురంలో కలిశారు. మండల వ్యా ప్తంగా కలిసికట్టుగా అందరూ పనిచేయాఆలని అంబికా సూచించినట్లు తెలిపారు. కలిసిన వారిలో బాలరంగయ్య, ఎల్లుట్ల సతీష్ ఉన్నారు.
10కుటుంబాలు టీడీపీలో చేరిక
పెద్దవడుగూరు: మండలకేంద్రంలో ఆదివారం ఎస్వీ రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన 10 కుటుంబాలు టీడీపీలో చేరాయి. పార్టీలో చేరిన బాలకృష్ణారెడ్డి, జయరామిరెడ్డి, విశ్వనాథ్‌రెడ్డి, రమే్‌షరెడ్డి, దర్శిరెడ్డి, జయ తదితరులకు రవీంద్రారెడ్డి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. నియోజకవర్గ అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని నమ్మి పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కేశవరెడ్డి, పుట్లూరు లక్ష్మికాంతరెడ్డి, హరినాథ్‌రెడ్డి, గంగరాజుయాదవ్, నాగేశ్వర్‌రెడ్డి, సూర్యనారాయణరెడ్డి, రవిప్రకా్‌షరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....