MLA: చివరి ఆయకట్టు వరకు సాగునీరందిస్తాం
ABN , Publish Date - Dec 19 , 2024 | 12:01 AM
రైతుల ప్ర యోజనాలే తమకు ప్రా ధాన్యమని, చివరి ఆయక ట్టు వరకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొ న్నారు. హెచఎల్‌సీ కాలు వను ఎమ్మెల్యే బుఽధవా రం పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు ప్రయోజనాలే ముఖ్యంగా ఏన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ
నార్పల, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): రైతుల ప్ర యోజనాలే తమకు ప్రా ధాన్యమని, చివరి ఆయక ట్టు వరకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొ న్నారు. హెచఎల్‌సీ కాలు వను ఎమ్మెల్యే బుఽధవా రం పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు ప్రయోజనాలే ముఖ్యంగా ఏన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. చెరువులన్నింటిని నీటితో నింపుతామని, అం దులో ఎలాంటి సందేహాలకు తావు లేదన్నారు. గత ప్రభుత్వం సాగునీటి వ్యవస్థను నిర్లక్ష్యం చేసిందన్నారు. సాగునీటి కాలువలు దెబ్బతిన్నాయని వాటికి మరమ్మతులు చేపడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు, మాజీ ఎంపీటీసీ ఆకుల ఆంజనేయులు, సౌత కెనాల్ చైర్మన చంద్రశేఖర్‌నాయుడు, వైస్ చైర్మన చండ్రాయుడు, టీడీపీ నాయకులు ఆకుల ఇంజనేయులు, ఆకుల విజయకుమార్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....