Share News

MLA : రెవెన్యూ సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలి

ABN , Publish Date - Mar 16 , 2025 | 12:52 AM

రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టిసారించాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. రెవె న్యూ సమస్యలను జఠిలం చేసుకోకుండా రాజీ మార్గంలో వెళితే ఇరువర్గాల కు నష్టం ఉండదని ఆమె అభిప్రాయపడ్డారు. మండల కేంద్ర మైన రామగిరిలో పంచాయతీ రాజ్‌ శాఖ గెస్ట్‌హౌస్‌లో శనివారం ఎమ్మెల్యే ప్రజాదర్భార్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.

MLA : రెవెన్యూ సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలి
MLA receiving petitions at Praja Darbar

- అధికారులకు ఎమ్మెల్యే పరిటాల సునీత సూచన

- రామగిరిలో ప్రజా దర్బార్‌

రామగిరి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టిసారించాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. రెవె న్యూ సమస్యలను జఠిలం చేసుకోకుండా రాజీ మార్గంలో వెళితే ఇరువర్గాల కు నష్టం ఉండదని ఆమె అభిప్రాయపడ్డారు. మండల కేంద్ర మైన రామగిరిలో పంచాయతీ రాజ్‌ శాఖ గెస్ట్‌హౌస్‌లో శనివారం ఎమ్మెల్యే ప్రజాదర్భార్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పరిటాల సునీత స్వయంగా ప్రజల నుం చి వినతులు స్వీక రిం చారు. ఇందులో ప్రధా నంగా భూ వివాదాలు, పింఛన్లు, హౌసింగ్‌, వీధిలైట్ల సమస్యలు వచ్చాయి. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్క రించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. అనంతరం ఆమె మాట్లా డుతూ... భూ వివాదాలను కోర్డు వరకు తీసుకెళ్లితే అవి పరిష్కారమ య్యేందుకు చాలా సమయం పడుతుందన్నారు. రాజీమార్గంలో పరి ష్కరించుకోవాలని సూచించారు. ఆనలైనలో పేర్ల మార్పు, భూ కబ్జాలు వంటి వాటిపై అధికారులు తగిన చర్యలు తీసుకో వాలన్నారు. త్వరలోనే కొత్తపింఛన్లు, ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌ నాయకులు ఎల్‌ నారాయణచౌదరి, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు రంగయ్య, నాయకులు రామ్మూర్తినాయుడు, పరంధా మయాదవ్‌, మండల కన్వీనర్‌ సుధాకర్‌, ప్రధాన కార్యదర్శి మారుతీ ప్రసాద్‌, తెలుగుయువత నాయకుటు శ్రీధర్‌నాయుడు, మాజీ సర్పంచ శ్రీనివాసులు, నాగేశనాయుడు, పేపర్‌శీన, అక్కులప్ప, పోలేపల్లి చంద్రప్ప, ఎస్‌ ఆంజనేయులు, విశ్వనాథ్‌, కోనంకి ముత్యాలు, గంగిరెడ్డి, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Mar 16 , 2025 | 12:52 AM