Share News

Minister Savita అందరి సహకారంతో స్వచ్ఛాంధ్ర: మంత్రి సవిత

ABN , Publish Date - Mar 16 , 2025 | 12:17 AM

రాష్ట్ర ప్రజల సహకారంతోనే గ్రామాల నుంచి పట్టణాల వరకు పరిశుభ్రత నెలకొంటుందని మంత్రి సవిత పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర.. స్వచ్ఛ దివస్‌ కార్యక్రమాన్ని శనివారం పెనుకొండలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. నగర పంచాయతీ కార్మికులు, ఎన్డీఏ కూటమి నాయకులు పలువురు ప్రజలతో కలిసి దర్గాసర్కిల్‌లో మానవహారంగా ఏర్పడి స్వచ్ఛభారతపై ప్రతిజ్ఞ చేయించారు.

Minister Savita అందరి సహకారంతో స్వచ్ఛాంధ్ర:  మంత్రి సవిత
చీపురుపట్టి రోడ్లు ఊడ్చుతున్న మంత్రి సవిత

పెనుకొండ టౌన, మార్చి 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజల సహకారంతోనే గ్రామాల నుంచి పట్టణాల వరకు పరిశుభ్రత నెలకొంటుందని మంత్రి సవిత పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర.. స్వచ్ఛ దివస్‌ కార్యక్రమాన్ని శనివారం పెనుకొండలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. నగర పంచాయతీ కార్మికులు, ఎన్డీఏ కూటమి నాయకులు పలువురు ప్రజలతో కలిసి దర్గాసర్కిల్‌లో మానవహారంగా ఏర్పడి స్వచ్ఛభారతపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం చీపురుపట్టి రోడ్లు ఊడ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వైసీపీ పాలనలో చెత్తపై పన్నువేసి ప్రజలను ఇబ్బంది పెట్టడంతోపాటు చెత్త తరలించడంలో అశ్రద్ధ వహించారని విమర్శించారు. అదే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు చెత్తపై పన్ను రద్దు చేయడంతో పాటు సంపద సృష్టిస్తున్నారన్నారు. కార్యక్రమంలో కమిషనర్‌ సతీ్‌షకుమార్‌, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ రాఘవన, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, రమే్‌షబాబు, కన్వీనర్‌ శ్రీరాములు, నాయకులు చిన్నవెంకటరాముడు, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2025 | 12:17 AM