Deo పది పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
ABN , Publish Date - Mar 16 , 2025 | 12:18 AM
జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీఈఓ కిష్టప్ప తెలిపారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 104 పరీక్షా కేంద్రాల్లో 28,730 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు.

అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలి :
డీఈఓ కిష్టప్ప
కొత్తచెరువు, మార్చి 15(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీఈఓ కిష్టప్ప తెలిపారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 104 పరీక్షా కేంద్రాల్లో 28,730 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు. ఈ నెల 17వతేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తీ చేశామన్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గాలి, వెలుతురు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేవిధంగా ఏర్పాట్లు చేశామని వివరించారు. జిల్లాలో ఆరు సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయని, వాటిలో సీసీ కెమరాలతో పాటు సిట్టింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటుచేశామని తెలిపారు. పరీక్షలు జరిగే సమయంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని సమీప యజమానులకు నోటీసులు అందజేశామన్నారు. 144 సెక్షన అమలులో ఉంటుందని, ఎవరైనా పరీక్షా కేంద్రాల వద్ద ఆటంకం కల్గిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా పరీక్షల విభాగపు అధికారి లాజర్, ఎంఈఓ జయచంద్ర పాల్గొన్నారు.