ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Purandeswari: ‘వై నాట్ 175’ వెనుక జగన్ దొంగ ఓట్ల కుట్ర: పురందేశ్వరి

ABN, Publish Date - Jan 24 , 2024 | 05:36 PM

ఆంధ్రప్రదేశ్‌లో దొంగ ఓట్ల వ్యవహారం రాజకీయాలను కుదిపేస్తోంది. దొంగ ఓట్లపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరో 2, 3 నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో దొంగ ఓట్ల వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. నకిలీ ఫామ్-7 దరఖాస్తులపై ఇప్పటివరకు 70 కేసులు నమోదయ్యాయి. ఏడాదిలో 30 లక్షల దొంగ ఓట్లను కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు తొలగించారు. అధికార వైసీపీ కుట్ర ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి దొంగ ఓట్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ అక్రమాలు

ప్రతి సందర్భంలో సీఎం జగన్ ‘వై నాట్ 175’ అంటున్న సంగతి తెలిసిందే. దాని వెనక దొంగ ఓట్ల ద్వారా లబ్ది పొందాలనే కుట్ర దాగి ఉందని పురందేశ్వరి అన్నారు. విజయవాడలో బుధవారం ‘గావ్ ఛలో అభియాన్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాలో అధికార వైసీపీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. అందుకోసమే వచ్చే ఎన్నికల్లో విజయంపై ధీమాతో ఉన్నారని వివరించారు.

35 వేల దొంగ ఓట్లు

తిరుపతి ఉప ఎన్నిక సమయంలో 35 వేల దొంగ ఓట్లు వేయించారని పురందేశ్వరి ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అలాగే చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ కుట్రలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.కోట్ల నిధులు మంజూరు చేసిందని పురంధేశ్వరి వివరించారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో పలు పనులను ఏపీ సర్కార్ చేపట్టిందని ఆమె పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుల అంశాన్ని హైకమాండ్ చూసుకుంటుందని స్పష్టంచేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 24 , 2024 | 06:05 PM

Advertising
Advertising