Share News

Veterinary Dept : పశువులకూ.. ఆధార్‌

ABN , Publish Date - Dec 25 , 2024 | 04:45 AM

మనుషులకు ఆధార్‌ గుర్తింపు నంబర్‌ ఉన్నట్టే.. పశువులకూ గుర్తింపు నంబరు (పశు ఆధార్‌) ఇవ్వనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ దామోదర్‌నాయుడు చెప్పారు.

 Veterinary Dept : పశువులకూ.. ఆధార్‌

అమరావతి, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): మనుషులకు ఆధార్‌ గుర్తింపు నంబర్‌ ఉన్నట్టే.. పశువులకూ గుర్తింపు నంబరు (పశు ఆధార్‌) ఇవ్వనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ దామోదర్‌నాయుడు చెప్పారు. ఇన్ఫర్మేషన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ యానిమల్‌ ప్రొడక్టివిటీ అండ్‌ హెల్త్‌ అనే నెట్‌వర్క్‌ ద్వారా 12 అంకెల నంబరును చెవి పోగుపై ముద్రించి, పశువులకు వేయడానికి రూపొందించినట్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఆవు, గేదె, దూడ, మేక, గొర్రెకు చెవి పోగులు వేస్తామన్నారు. బార్‌కోడింగ్‌తో పశు యజమాని పేరు, చిరునామా, పశువు వివరాలను ఐఎన్‌ఏపీహెచ్‌ అనే ఆన్‌లైన్‌ పోర్టల్‌లో నిక్షిప్తం చేస్తామని చెప్పారు. దీనివల్ల పశువు ఆరోగ్య వివరాలతోపాటు, ప్రభుత్వ పథకాల లబ్ధి వివరాలు తెలుస్తాయని అన్నారు.

Updated Date - Dec 25 , 2024 | 04:46 AM