ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Cabinet: ఈ మూడు విషయాలపైనే ఏపీ కేబినెట్‌లో చర్చ.. ఫైనల్‌గా..!

ABN, Publish Date - Jul 16 , 2024 | 05:08 PM

ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక విషయాలపై చర్చ జరిగింది. ఇదే సమావేశంలో పలు యాక్ట్‌లకు ఆమోదం కూడా లభించింది. ముఖ్యంగా.. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్, ఉచిత ఇసుక విధానం, రబీ సీజన్‌లో ధాన్యం సేకరణపై కీలకంగా చర్చ సాగింది...

అమరావతి: ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక విషయాలపై చర్చ జరిగింది. ఇదే సమావేశంలో పలు యాక్ట్‌లకు ఆమోదం కూడా లభించింది. ముఖ్యంగా.. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్, ఉచిత ఇసుక విధానం, రబీ సీజన్‌లో ధాన్యం సేకరణపై కీలకంగా చర్చ సాగింది. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు.


ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై..

ప్రజాస్వామ్యంలో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు చట్టాలు చేస్తాయి. కేంద్ర ప్రభుత్వంలోని నీతి అయోగ్ ల్యాండ్ టైటిల్ యాక్ట్‌కు ప్రతపాదనలు చేస్తూ అన్ని రాష్ట్రాలకు పంపింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అమలు చేయలేదు. దీనిపై పత్రికలు, మీడియా, మేథావులు అనేక సందేహాలు వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం హడావుడిగాస్టేక్ హోల్డర్లతో చర్చించకుండా భయంకరమైన చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టం వల్ల చిన్న సన్నకారు రైతులు నిద్రలేని రాత్రులు గడిపారు. నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టానికి వీరి చట్టానికి పోలికే లేదు. నీతి అయోగ్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ టైటిల్ రిజిష్ట్రేషన్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు. ఏపీ యాక్ట్‌లో ఎవరు ఈ పని చేస్తారు..? అనే దానిపై స్పష్టత లేకుండా ఎనీ పర్సన్ అని చెప్పారు. ఈ అధికారికి అపరమితమైన అధికారాలు ఇచ్చారు.. కోర్టులకు వెళ్లకుండా చట్టం తెచ్చారు. గత ప్రభుత్వం చేసిన ఏపి ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ వివాదాలను పెంచుతుంది తప్ప తగ్గించదు. ఈ చట్టం రివెన్యూ వ్యవస్ధలను, రిజిష్ట్రేషన్ వ్యవస్ధలను, ల్యాండ్ రికార్డులను పూర్తిగా ధ్వంసం చేసేలా దీన్ని తెచ్చారు. గత ప్రభుత్వ వ్యవహర తీరు చూసి మా ఆస్తులు కూడా తాకట్టు పెట్టుకుంటారేమో..? రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒరిజనల్ డాక్యుమెంట్లు ఇవ్వం జిరాక్సులు ఇస్తాం అన్నారు. ఇదే చట్టం ఉండి ఉంటే ఇప్పటికే గిఫ్ట్ డీడ్స్, మార్టిగేజ్ డీడ్స్‌ను రీ-రిజిష్ట్రేషన్ చేసుకోవాలని పొందుపర్చారు. ఆ చట్టం వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారని దాన్ని రద్దు చేశారు’ అని మంత్రి పార్థసారథి చెప్పుకొచ్చారు.


ఇసుక పాలసీపై..!

‘గత ప్రభుత్వం చేసిన ఇసుక పాలసీని, వివిధ సంస్ధలతో చేసుకున్న అగ్రిమెంట్లు రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వానికి బకాయిలు ఉన్నా వారికి ఎన్‌వోసీ కంటిన్యూ చేశారు. ప్రభుత్వం ఇప్పడు ఎటువంటి ఆధాయం ఆశించకుండా ఉచితంగా ఇసుక ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. నిర్మాణ రంగం భవన నిర్మాణ కార్మికుల, ఇసుక వినియోగదారుల సంక్షేమ కోసం ఉచిత ఇసుక ఇచ్చారు. ఉచిత ఇసుకపై ఇచ్చిన జీవోను నేడు ర్యాటిఫై మంత్రి మండలి చేసింది. ఉచిత ఇసుక విషయంలో జిల్లా స్ధాయి కమిటీలు అధికారులతో వేసి వారి ఆధ్వర్యంలో అందించాలని నిర్ణయం తీసుకున్నాం. గత ప్రభుత్వం సుప్రీంకోర్టు, గ్రీన్ ట్రిబ్యూనల్‌ను మొసం చేసేలా సర్టిఫికెట్లు ఇసుక విషయంలో ఇచ్చింది అని కేబినెట్ భేటీలోని అంశాలను పార్థసారథి మీడియాకు వివరించారు.


ధాన్యం కోనుగోలుపై..!

ధాన్యం కోనుగోలు ఒక మండలంలోనిది ఇంకో మండలానికి ట్యాగ్ చేయడం.. రైతులకు ఇవ్వాల్సిన సోమ్మును 90 రోజులు వరకూ ఆపడం వారిని ఇబ్బందులు గురిచేయడం ఇలా గతంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. గత ప్రభుత్వ రబీ సీజన్‌లో ధాన్యం సేకరణ చేసి 1600 కోట్లు ఇవ్వకుండా పెండింగ్ పెట్టింది. దీన్ని చెల్లించేందుకే అప్పు చేస్తున్నాం. వచ్చే సీజన్‌లో రైతులకు ఇబ్బంది లేకుండా 3200 కోట్లు బుణం పొదేందుకు వ్యవసాయ సహకార శాఖకు ఆమోదం తెలిపారు. సరైన క్రాప్ ఇన్సూరెన్స్ విధానం లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీనికి ముగ్గురు మంత్రుల తో కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. కౌలు రైతులకు పూర్తిగా బ్యాంకుల నుంచి రావడం లేదనే విషయంపై కౌలు రైతు కార్డు ఇచ్చే విషయంపైనా క్యాబినెట్‌లో చర్చించాం. కౌలు రైతు కార్డులు ఎలా ఇవ్వాలి..? అనేదానిపై చర్చించి త్వరలో నిర్ణయం తీసుకోనున్నాం. ప్రకృతి వ్యవసాయానికి గుల్బేనికెన్ అవార్డు వచ్చింది. 2029 నాటికి 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేయడానికి సన్నాహకాలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ నెలరోజుల్లోనే విమానాల్లో, రైళ్లలో 35శాతం ఆకుపెన్సీ పెరిగింది. ఇదే అప్పటికి ఇప్పటికీ ఉన్న తేడాను చూపుతుంది. నిన్నమొన్నటి వరకూ మూసి వేసి ఉన్న మల్లవల్లిలోని అశోక్ లేల్యాండ్ వారు తిరిగి వచ్చి ఎంప్లాయిస్ కావాలంటే గన్నవరం ఎమ్మెల్యే, మంత్రిగా నేను మాట్లాడాము. ఈరోజు కూడా రాష్ట్రంలో ఒక ఐటి కంపెనీ పెడతామని వచ్చారు.. ఇప్పటికే చర్చించాం ఇవన్ని మార్పును సూచిస్తోంది. రాష్ట్రంలో సంపద సృష్టికి సంకేతం ఇదే అని కేబినెట్ భేటీలోని విషయాలను పార్థసారథి మీడియాకు వివరించడం జరిగింది.

Updated Date - Jul 16 , 2024 | 05:27 PM

Advertising
Advertising
<