Congress: ఈనెల 22న ‘ఛలో సెక్రటేరియట్’కు ఏపీ కాంగ్రెస్ పిలుపు
ABN, Publish Date - Feb 20 , 2024 | 04:14 PM
Andhrapradesh: ఈనెల 22న ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆధ్వర్యంలో యువజన సమస్యల మీద ‘‘ఛలో సెక్రటేరియట్’’కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ మేరకు మంగళవారం సీడబ్యూసీ ఆహ్వానిత సభ్యులు గిడుగు రుద్రరాజు మీడియాకు తెలియజేశారు. ఎ
విజయవాడ, ఫిబ్రవరి 20: ఈనెల 22న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (APCC Chief YS sharmila) ఆధ్వర్యంలో యువజన సమస్యల మీద ‘‘ఛలో సెక్రటేరియట్’’కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ మేరకు మంగళవారం సీడబ్యూసీ ఆహ్వానిత సభ్యులు గిడుగు రుద్రరాజు (Congress leader Gidugu Rudraraju) మీడియాకు తెలియజేశారు. ఎల్లుండి ఉదయం 10 గంటలకు ఆంధ్రభవన్ నుంచి ఛలో సెక్రటేరియట్ ప్రారంభమవుతుందని తెలిపారు. పార్టీ సీనియర్లు, యువజన కాంగ్రెస్, పార్టీ అనుబంధ సంఘాలు పాల్గొంటాయన్నారు. 26న సాయంత్రం అనంతపురంలో జరిగే భారీ బహిరంగ సభలో మల్లిఖార్జున ఖర్గే ప్రసంగిస్తారని తెలిపారు. విశాఖ, గుంటూరు, జంగారెడ్డిగూడెంలలో బహిరంగ సభలు ఉంటాయని.. కర్నాటక, తెలంగాణ సీఎంలు, ప్రియాంక గాంధీ బహిరంగ సభలలో ప్రసంగిస్తారని వెల్లడించారు. చివరిగా రాహుల్ గాంధీ సమక్షంలో భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. మార్చి చివరకల్లా ఈ షెడ్యూల్ పూర్తి చేసేలా సిద్ధం చేశామని గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Feb 20 , 2024 | 04:16 PM