AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. చాగంటి కోటేశ్వరరావుకు మరో బాధ్యత
ABN, Publish Date - Dec 21 , 2024 | 11:50 AM
AP Govt: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చాగంటి కోటేశ్వరరావుకు మరో కీలక బాధ్యతను అప్పగించింది. ఇప్పటికే కేబినెట్ హోదాలో సలహాదారు పదవిలో ఉన్న చాగంటికి సర్కారు అప్పగించిన ఆ బాధ్యత ఏంటో ఇప్పుడు చూద్దాం..
ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును విద్యార్థులు-నైతికత విలువల సలహాదారు పదవిలో కేబినెట్ హోదాతో ఏపీ సర్కారు నియమించిన సంగతి తెలిసిందే. ఈ పదవిని స్వీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. రీసెంట్‌గా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు చాగంటి. త్వరలోనే ఆయన పూర్తిస్థాయి బాధ్యతల్ని చేపట్టనున్నారు. ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చాగంటి కోటేశ్వరరావుకు మరో ముఖ్యమైన బాధ్యత అప్పగించింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
పుస్తకాల రూపకల్పన
రాష్ట్ర నైతికత, విలువల ప్రభుత్వ సలహాదారుగా ఉన్న చాగంటి కోటేశ్వరరావుతో ప్రత్యేకంగా పుస్తకాలు తయారు చేయించాలని సర్కారు నిర్ణయించింది. రెండ్రోజుల కింద కేబినెట్ భేటీలో ఈ డెసిషన్ తీసుకున్నారు. పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు ఈ పుస్తకాలను చాగంటితో రూపొందించి పంపిణీ చేయనుంది ప్రభుత్వం. ఇదే సమయంలో కేజీ నుంచి పీజీ దాకా ఇంటిగ్రేట్ చేస్తూనే.. స్టూడెంట్స్‌కు విలువలతో కూడిన పాఠ్యప్రణాళిక తయారు చేయాలనే మరో నిర్ణయం కూడా తీసుకుంది. సర్కారు బడుల్లో చదివే వారికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర స్కీమ్ కింద కిట్లు అందజేయాలని డిసైడ్ అయింది.
భారీ వ్యయంతో..
32 కోట్ల 45 లక్షల వ్యయంతో రూపొందించిన కిట్లలో టెక్స్ట్ బుక్స్‌తో పాటు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్, రికార్డ్ బుక్స్ ఉంటాయి. వీటితో పాటు రాత పుస్తకాలు కూడా ఉంటాయి. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ స్టూడెంట్స్‌కు జనవరి నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే వచ్చే ఎడ్యుకేషనల్ ఇయర్ నుంచి ఇంటర్ కళాశాలల్లో జేఈఈ, నీట్, ఈఏపీసెట్ మీద కూడా ట్రెయినింగ్ ఇస్తారు. కాగా, నైతిక సలహాదారుగా నియమితులైన చాగంటి కోటేశ్వరరావు ఈ పదవిని స్వీకరిస్తున్నట్లు తెలిపారు. పిల్లలకు ఉపయోగపడేలా నాలుగు మంచి మాటలు చెప్పాలనే ఉద్దేశంతో సర్కారు ఇచ్చిన పదవిని అంగీకరిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. పదవుల కోసం ఒప్పుకోలేదని.. తన మాటలతో పిల్లలకు మేలు జరిగితే చాలనే ఉద్దేశంతోనే ఓకే అన్నానని పేర్కొన్నారు.
Also Read:
ఏపీలో మళ్లీ భూ ప్రకంపనలు.. ఎక్కడంటే?
ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్.. న్యూ ఇయర్ గిఫ్ట్ రెడీ..
అప్రమత్తంగా ఉండండి.. అధికారులకు సీఎం ఆదేశాలు
భవానీ దీక్ష విరమణలు.. సీపీ కీలక వ్యాఖ్యలు
For More AP And Telugu News
Updated Date - Dec 21 , 2024 | 11:53 AM