APPSC: జగన్ ప్రభుత్వంపై ఏపీపీఎస్సీ సభ్యుడు సోనీవుడ్ సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Mar 07 , 2024 | 09:45 AM
Andhrapradesh: జగన్ ప్రభుత్వంపై ఏపీపీఎస్సీ సభ్యుడు సోనీవుడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితులపై వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న దాడులపై వీడియో విడుదల చేశారు. ‘‘కాకినాడలో దళిత డ్రైవర్ హత్య, తొండంగిలో దళిత యువకుడి హత్య, మల్లవరంలో పాలిటెక్నిక్ విద్యార్ధి హత్య వెనుక ముగ్గురు నిందితులు వైసీపీ వారే అని.. కానీ డబ్బులు, అధికారం ఉంటే హత్యలు చేసి బయట తిరగొచ్చా’’ అని అడిగారు.
కాకినాడ, మార్చి 7: జగన్ ప్రభుత్వంపై (Jagan Government) ఏపీపీఎస్సీ సభ్యుడు సోనీవుడ్ (APPSC Member Sonywood) సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితులపై వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న దాడులపై వీడియో విడుదల చేశారు. ‘‘కాకినాడలో దళిత డ్రైవర్ హత్య, తొండంగిలో దళిత యువకుడి హత్య, మల్లవరంలో పాలిటెక్నిక్ విద్యార్ధి హత్య వెనుక ముగ్గురు నిందితులు వైసీపీ వారే అని.. కానీ డబ్బులు, అధికారం ఉంటే హత్యలు చేసి బయట తిరగొచ్చా?.. రాజకీయ పార్టీ ఇలాంటి నేర చరిత్ర కలిగిన వాళ్లను కాపాడవచ్చా? కొద్దిరోజులుగా నాకు నిద్ర పట్టడం లేదు. కుటుంబసభ్యులతో చర్చించాకే ఈ వీడియో విడుదల చేస్తున్నా . ఈ వీడియో నా జీవితాన్ని రిస్క్ లో పెట్టేదే. అయినా సరే జగన్‌ను ప్రశ్నిస్తూ ఈ వీడియో పెడుతున్నా. హత్య కేసుల్లో ఏ1గా ఉన్నవాడు పార్టీ కార్యకలా పాల్లో ఎంత వరకు పాల్గొనవచ్చు? అలాంటప్పుడు తప్పకుండా మరో సామాజికవర్గం మీ నుంచి దూరం అవుతుంది. బాధిత కుటుంబాలకు డబ్బులు రావొచ్చు. అన్నీ మరచిపోయి బతకొచ్చు. కానీ పేదలు, తక్కువ కులాల వారికి భద్రత ఏమిటి? చనిపోయిన వారిని తిరిగి తీసుకురండి అని అడగడం లేదు. చంపేసిన వాళ్లను శిక్షించండి జైలుకు పంపండి అనీ అడగడం లేదు. రేపు ఇంకొకరి హత్య జరగదు అని నమ్మకం ఏమిటి? అన్నింటికంటే ముఖ్యంగా ప్రాణాల్ని కాపాడతామని ప్రభుత్వపరంగా ఏ రకంగా హామీ ఇవ్వగలదు? చంపిన వాళ్ళను పార్టీల్లో క్రియాశీలకంగా లేకుండా చేసి.. తీవ్రమైన సంకేతం ఇవ్వలేక మీ నుంచి పేదలు దూరమయ్యే అవకాశాలున్నాయి. అంబేడ్కర్ విగ్రహం కింద చనిపోయిన రాము ఉన్నారు. శృంగ వృక్షంలో జరిగిన హత్య తర్వాత తునిలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు. ఆ విగ్రహం కింద చనిపోయిన రాము ఉన్నారనే విషయాన్ని మరచి పోకూడదు. రాము చనిపోవడం వల్ల దళితుల్లో వ్యతిరేకత వస్తుందనే వాదనతో వారిపై ప్రేమ చూపించుకోవడానికి విగ్రహం పెట్టారని అందరికీ తెలుసు. పాదయాత్రలో పాల్గొన్నప్పటి నుంచి నేనూ చాలా నష్టపోయా. కానీ ప్రభుత్వం వచ్చాక నా కుటుంబానికి సీఎం జగన్ మేలు చేశారు. లాభం పొందానని నేను నోరు మూసుకుని ఉంటే స్వార్థపరుడిని అవుతాను’’ అంటూ సోనీవుడ్ కామెంట్స్ చేశారు.
ఇవి కూడా చదవండి...
Tirumala: శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతోందంటే..
Nara Lokesh: నారా లోకేష్ మలివిడత శంఖారావం వివరాలు...
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Mar 07 , 2024 | 10:29 AM