Army Jawan : జవాన్ సుబ్బయ్య వీరమరణం
ABN, Publish Date - Dec 11 , 2024 | 05:09 AM
జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో ఉగ్రవాదులు అమర్చిన మందుపాతర పేలి ప్రకాశం జిల్లాకు చెందిన జవాన్ వరికుంట్ల వెంకటసుబ్బయ్య(40) వీరమరణం పొందారు.
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు అమర్చిన మందుపాతర పేలి మృతి
స్వగ్రామం ప్రకాశం జిల్లా రావిపాడులో విషాదచాయలు
కంభం/నార్పల, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో ఉగ్రవాదులు అమర్చిన మందుపాతర పేలి ప్రకాశం జిల్లాకు చెందిన జవాన్ వరికుంట్ల వెంకటసుబ్బయ్య(40) వీరమరణం పొందారు. ఆయన ఆర్మీలోని 25వ రాష్ట్రీయ రైఫిల్స్‌లో హవల్దార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం విధుల్లో ఉండగా చోటుచేసుకొంది. వెంకటసుబ్బయ్య స్వస్థలం ప్రకాశం జిల్లా కంభం మండ లం రావిపాడు గ్రామం. 15 ఏళ్ల క్రితం ఆర్మీలో జవాన్‌గా చేరారు. ఆయన అనంతపురం జిల్లా నార్పలకు చెందిన జీమాను రామకృష్ణ కుమార్తె లీలావతిని వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లల చదువుల కోసం ఆరేళ్ల క్రితం కుటుంబాన్ని నార్పలకు మార్చారు. సుబ్బయ్య వీరమరణం చెందాడని తెలియగానే రావిపాడులో విషాదం నెలకొంది. వెంకటసుబ్బయ్య పార్థివదేహానికి నార్పలలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Updated Date - Dec 11 , 2024 | 05:09 AM