Pinnelli: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట..
ABN, Publish Date - Jun 20 , 2024 | 05:29 PM
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. పిన్నెల్లిపై ఉన్న కేసుల విషయంలో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఇచ్చిన..
అమరావతి: వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి (Pinnelli Ramakrsihana Reddy) హైకోర్టులో ఊరట లభించింది. పిన్నెల్లిపై ఉన్న కేసుల విషయంలో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం పొడిగించింది. తుది తీర్పు వచ్చే వరకు మధ్యంతర ఉత్తర్వులు పొడిగించడం జరిగింది. గురువారం మధ్యాహ్నం నుంచి పిన్నెల్లి బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఫైనల్‌గా తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు.. ఉత్తర్వులు పొడిగించింది. దీంతో పిన్నెల్లికి మరికొన్నిరోజులు ఊరట లభించినట్లయ్యింది.
ఏం జరిగింది..?
కాగా.. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో మాచర్ల నియోజకవర్గం పాల్వాయ్‌గేట్ పోలింగ్ బూత్‌లో ఈవీఎంను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇదొక కేసు కాగా.. హత్యాయత్నం చేసినట్లు కూడా మరో కేసు నమోదయ్యింది. ఈ కేసులపై కోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఇప్పటికే జూన్-20 వరకు మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయొద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఇవాళ గడువు ముగియడంతో పిన్నెల్లి బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత మధ్యంతర ఉత్తర్వులను న్యాయస్థానం పొడిగించింది.
Updated Date - Jun 20 , 2024 | 06:09 PM