Lavanya Raj Tarun Case: రాజ్ తరుణ్- లావణ్య కేసులో బిగ్ అప్డేట్.. కీలక వ్యక్తి అరెస్ట్
ABN, Publish Date - Aug 12 , 2024 | 05:08 PM
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్- లావణ్య కేసు రోజుకో మలుపు తరిగింది. రోజుకో కొత్త విషయం.. పూటకో ట్విస్ట్‌గా సాగుతున్న ఈ ఎపిసోడ్‌లో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. ఈ కేసులో ఎక్కువగా వినిపించిన పేరు మస్తాన్ సాయి. ఇతను డ్రగ్ పెడ్లర్‌గా వ్యవహరిస్తూ.. పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఓవైపు లావణ్య కేసులో.. మరోవైపు వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో మస్తాన్ పేరు మార్మోగింది. ఈ క్రమంలోనే నిందితుడిని గాలించిన ఏపీ పోలీసులు సోమవారం నాడు గుంటూరు జిల్లాలో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు..
గుంటూరు/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్- లావణ్య కేసు (Raj Tarun Lavanya Case) రోజుకో మలుపు తరిగింది. రోజుకో కొత్త విషయం.. పూటకో ట్విస్ట్‌గా సాగుతున్న ఈ ఎపిసోడ్‌లో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. ఈ కేసులో ఎక్కువగా వినిపించిన పేరు మస్తాన్ సాయి. ఇతను లావణ్య బాయ్ ఫ్రెండ్..! డ్రగ్ పెడ్లర్‌గా వ్యవహరిస్తూ.. పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఓవైపు లావణ్య కేసు.. మరోవైపు వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో మస్తాన్ పేరు మార్మోగింది. ఈ క్రమంలోనే నిందితుడిని గాలించిన ఏపీ పోలీసులు సోమవారం నాడు గుంటూరు జిల్లాలో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు నుంచి మస్తాన్‌ను హైదరాబాద్‌కు తరలించేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఎట్టకేలకు పట్టేశారు..!
రాజ్ తరుణ్- లావణ్య కేసులో ఎన్ని సంచలన విషయాలు బయటికొచ్చాయో.. అంతకుమించి ట్విస్టులు చోటుచేసుకున్నాయని చెప్పుకోవచ్చు. టీవీ డిబెట్లు, సోషల్ మీడియా ద్వారా లెక్కలేనన్ని విషయాలు వెలుగుచూశాయ్. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడమో కాదు.. సంచలన ఆరోపణలు, వీడియోలు బయటికి రావడంతో జనాలు ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి. సరిగ్గా ఈ క్రమంలోనే కేసులో బిగ్ అప్డేట్ వచ్చేసింది. నాడు వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసు.. నేడు రాజ్ తరుణ్- లావణ్య కేసులో కీలక వ్యక్తి మస్తాన్ సాయి. ఈ రెండు కేసుల్లోనూ ఈ పేరు ప్రధానంగా ఉన్న ఈ యువకుడిని అరెస్ట్ చేస్తే కేసులు ఓ కొలిక్కి వస్తాయని భావించిన ఏపీ స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో స్పెషల్ ఫోకస్ పెట్టింది. గుంటూరులోని ఓ దర్గాలో తలదాచుకుని ఉండగా పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ దర్గాకు మస్తాన్ తండ్రి నిర్వాహకుడిగా ఉన్నట్లు పోలీసులు తేల్చారు. ఈ అరెస్ట్‌తో లావణ్య కేసు మరోసారి బర్నింగ్ టాపిక్ అయ్యింది. జూన్-03న విజయవాడ రైల్వే స్టేషన్‌లో డ్రగ్స్ తరలిస్తుండగా సెబ్ పోలీసులు దాడులు చేశారు. అప్పట్లో పోలీసులు కళ్లుగప్పి పరారైన మస్తాన్ సాయి.. నాటి నుంచి అడ్రస్ లేకుండా పోయాడు. సీన్ కట్ చేస్తే ఇవాళ ఇలా అరెస్ట్ అయ్యాడు.
ఫోన్‌లో బూతులు!
అరెస్ట్ అయిన మస్తాన్ సాయి ఫోన్‌లో చాలా మంది అమ్మాయిల వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పలువురు అమ్మాయిల ప్రైవేటు వీడియోలు చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు కూడా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తునే ఆరోపణలు ఉన్నాయి. మొబైల్‌లో ఉన్న వీడియోలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన అమ్మాయిలను టార్గెట్‌గా చేసుకొని మస్తాన్ మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారని తెలిసింది. ఫోన్‌లో పెద్ద ఎత్తున ఫొటోలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారని సమాచారం. దీంతో పాటు కాల్ డేటా, మెయిల్ ఐడీ అన్నీ నిశితంగా పోలీసులు పరిశీలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఇదంతా ఏపీ, హైదరాబాద్ పోలీసులు కలిసే దర్యాప్తు చేయబోతున్నారట.
ఎవరీ మస్తాన్..!?
డ్రగ్స్ విక్రయ కేసులో వరలక్ష్మి టిఫిన్స్ యజమాని ఎస్.ప్రభాకర్‌రెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ వ్యవహారం పెద్ద సంచలనమే అయ్యింది. ఈ డ్రగ్స్ కేసులోనూ మస్తాన్ సాయి ఉన్నాడు. నాటి నుంచి పోలీసులు ఇతడిని గాలిస్తూనే ఉన్నారు. గుంటూరు జిల్లా నగరంపాలెం మస్తానయ్య దర్గా నిర్వహకుడి కుమారుడే మస్తాన్ సాయి. డ్రగ్స్ కేసుల్లో పోలీసులు వెంబడిస్తుండటంతో దర్గాలోనే తలదాచుకుని ఉండగా పోలీసులు రంగంలోకి అరెస్ట్ చేశారు. ఈయన అరెస్ట్‌తో డ్రగ్స్ తీసుకున్న వారిలో టెన్షన్ మొదలైంది. ఎప్పుడేం జరుగుతుంది..? తర్వాత అరెస్ట్ ఎవరు..? అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మస్తాన్‌ను హైదరాబాద్ పోలీసులకు అప్పగించిన తర్వాత అసలు సినిమా మొదలవుతుందనే చర్చ పెద్ద ఎత్తునే జరుగుతోంది. మరోవైపు.. త్వరలోనే కీలక వ్యక్తిని పోలీసులు అదుపులోనికి తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని టాక్ నడుస్తోంది. మొత్తానికి చూస్తే.. అటు వరలక్ష్మి డ్రగ్స్ కేసు.. ఇటు రాజ్ తరుణ్-లావణ్య కేసులో ఈ అరెస్ట్‌తో దాదాపు వ్యవహారం కొలిక్కి వచ్చేస్తుందని పోలీసులు అంచనా వేస్తున్నారట. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి మరి.
Updated Date - Aug 12 , 2024 | 06:24 PM