KTR: ఏపీ పాలిటిక్స్‌పై కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్.. షర్మిల గురించి ఏమన్నారంటే..?
ABN, Publish Date - Jul 09 , 2024 | 03:56 PM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఏపీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఓటమి ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఢిల్లీలో మీడియా చిట్‌చాట్ సందర్భంగా జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మరోసారి ఏపీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఓటమి ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఢిల్లీలో మీడియా చిట్‌చాట్ సందర్భంగా జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఓవైపు తమ వైఫల్యంతోనే తెలంగాణలో ఓడిపోయామని ఒప్పుకున్న కేటీఆర్.. ఏపీలో మాత్రం ప్రజలకు మంచి పనిచేసినా జగన్ ఓడిపోయారన్నారు. జగన్ (Y S Jagan) హీరో.. షర్మిల జీరో అంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు మంగళగిరిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన వైఎస్సార్ జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ షర్మిలపై ప్రశంసలు కురిపిస్తూ.. 2029లో ముఖ్యమంత్రి అంటూ వ్యాఖ్యానించిన ఒకరోజు తర్వాత.. బీఆర్‌ఎస్ కీలక నేత, కేసీఆర్ కుమారుడు కేటీఆర్ షర్మిలను విమర్శిస్తూ జగన్‌ను ప్రశంసించడంపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
CM Chandrababu: విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు.. అసలు లెక్కలు ఇవే
కేటీఆర్ ఏమన్నారంటే..
ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఏపీ రాజకీయాలపై స్పందిస్తూ.. జగన్ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసినా ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ప్రజలకు మంచి చేసిన వ్యక్తులు ఎంతోమంది ఓడిపోవడం విచిత్రమనిపించిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. వైసీపీ ఓటమి చెందినా.. 40 శాతం ఓట్లు రావడం సాధారణ విషయం కాదన్నారు. 40శాతం మంది ఏపీ ఓటర్లు జగన్‌తోనే ఉన్నారని చెప్పారు. షర్మిలకు నాయకత్వ లక్షణాలు లేవన్నారు. కేవలం జగన్‌ను ఓడించడానికి షర్మిలను పావులా వాడుకున్నారని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమితో జతకట్టడం వలన ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. ఎప్పుడూ ప్రజల్లో ఉండే కేతిరెడ్డి ధర్మవరంలో ఓడిపోవడం ఏమిటో అర్ధంకావడంలేదన్నారు. ఏపీ ఫలితాలు మాత్రం తనను షాక్‌కు గురిచేశాయని చెప్పారు. గతంలోనూ కేటీఆర్ ఏపీ ఎన్నికల ఫలితాలపై ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు.
AP Cabinet: జులై 16న ఏపీ కేబినెట్ సమావేశం.. ఏం జరుగుతుందో..?
తెలంగాణ ఫలితాలపై..
తెలంగాణలో ఒక లోక్‌సభ సీటును గెలుచుకోకపోవడంపై కూడా కేటీఆర్ స్పందించారు. తమ ఓటమికి ఎన్నో కారణాలు ఉన్నాయన్నారు. ప్రజలతో కలవకపోవడం వలన తాము తెలంగాణలో ఓడిపోయామని కేటీఆర్ చెప్పారు. మా వైఖరి కొంతమేర మార్చుకోవల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మాలో తప్పుపెట్టుకుని.. ప్రజలను నిందిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండబోదని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజలకు, పార్టీ నాయకులకు మధ్య కొంత గ్యాప్ ఏర్పడిందని.. ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినా.. వారి ఆశీస్సులు పొందడంతో విఫలమైనట్లు తెలిపారు. ఏమి ఏమైనా తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ ఆనవాళ్లను చెరిపేయాలనుకుంటున్న వారి లక్ష్యం నెరవేరదన్నారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదురుచూశామని.. కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ వీడి వెళ్లినంతమాత్రన ఎలాంటి నష్టం లేదన్నారు.
NTTPS Accident: ఎన్టీటీపీఎస్ ప్రమాదంపై విచారణ చేస్తాం: మంత్రి వాసంశెట్టి..
SLBC Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఎల్‌బీసీ సమావేశం
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh and Telangana News
Updated Date - Jul 09 , 2024 | 04:13 PM