AP Politics : కుమ్మేసిన కూటమి
ABN, Publish Date - Jun 05 , 2024 | 03:52 AM
కుమ్మేసిన కూటమి! మారింది. ఈ అలజడికి వైసీపీ గల్లంతైపోయింది. దెబ్బ అదుర్స్... అనిపించింది. 175 నియోజకవర్గాల ఏపీ పొలిటికల్ మ్యాప్‌లో ‘ఫ్యాను’ ఆన్ అయిన నియోజకవర్గాలను కాగడా పెట్టుకుని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇచ్ఛాపురం నుంచి అనంతపురం దాకా ఒకటే పరిస్థితి! జిల్లాలకు జిల్లాలను కూటమి క్లీన్ స్వీప్ చేసింది.
ఏపీలో 164 సీట్లతో చరిత్రాత్మక విజయం.. డజనైనా దక్కని జగన్
పోటీ చేసిన అన్ని సీట్లలో జనసేన విజయ విహారం
కూటమికి కనీవినీ ఎరుగని విజయం.. 93.71% సీట్లలో గెలుపు
ఉమ్మడి జిల్లాల్లో ఖాతా తెరవని జగన్ పార్టీ
రాయలసీమలోనూ 7 సీట్లకే పరిమితం
బాబు ప్రమాణం 9న.. కూటమికి 21 ఎంపీ సీట్లు
నేడు ఎన్డీయే భేటీకి చంద్రబాబు, పవన్
రెడ్డి లేదు.. కమ్మ లేదు.. కాపు లేదు.. ఎస్సీ ఎస్టీలని కాదు! అందరిదీ ఒకే మాట.. బైబై జగన్! ‘ఒక్క చాన్స్’ అంటూ వచ్చి విధ్వంస పాలన అందించిన జగన్‌ను ఒక్క చాన్స్‌కే పరిమితం చేశారు! ‘బటన్ల పాలన’కు స్వస్తి పలికారు! కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా ఇవ్వలేదు! ‘అసలు మీ పార్టీ అభ్యర్థులే వద్దు బాబోయ్’ అని ఛీత్కరించినట్లు తీర్పిచ్చారు. జగన్ పాలనపై వ్యతిరేకత పెల్లుబకడం, మళ్లీ చంద్రబాబు కావాలని కోరుకోవడంతో టీడీపీ కూటమి అద్వితీయ విజయాన్ని సొంతం చేసుకుంది!
కుమ్మేసిన కూటమి! మారింది. ఈ అలజడికి వైసీపీ గల్లంతైపోయింది. దెబ్బ అదుర్స్... అనిపించింది. 175 నియోజకవర్గాల ఏపీ పొలిటికల్ మ్యాప్‌లో ‘ఫ్యాను’ ఆన్ అయిన నియోజకవర్గాలను కాగడా పెట్టుకుని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇచ్ఛాపురం నుంచి అనంతపురం దాకా ఒకటే పరిస్థితి! జిల్లాలకు జిల్లాలను కూటమి క్లీన్ స్వీప్ చేసింది. వైసీపీ ‘సున్నా’తో చతికిలబడింది.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా మంత్రులంతా మటాష్! నోటి దూల బూతుల నేతలకు దూల తీరింది. జన చేతన ముందు సోషల్ మీడియా మాయలు, ‘బటన్ నొక్కుడు’ మోసాలు పని చేయని స్పష్టమైంది. ‘నువ్వు మంచి చేయలేదు జగన్! నీకు ఓటు వెయ్యలేం’ అని జగన్‌కు ఓటమి రుచి ఘాటుగా చూపించారు. ఇది జన విజయం! ఘన విజయం! నవ్యాంధ్ర భవిష్యత్తుకు ఊపిరిలూదిరిన విజయం! అంతా... దేవుడు రాసిన స్ర్కిప్టు ప్రకారమే!
- అమరావతి, ఆంధ్రజ్యోతి
Updated Date - Jun 05 , 2024 | 05:05 AM