ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP NEWS: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. పలువురుకి తీవ్ర గాయాలు

ABN, Publish Date - Dec 17 , 2024 | 11:04 AM

తిరుపతిలో మంగళవారం ఉదయం బుల్డోజర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. నాయుడుపేట- పూత్తలపట్టు రహదారిలోని తిరుపతి రూరల్ గొల్లపల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది.

తిరుపతి: తిరుపతిలో ఇవాళ(మంగళవారం) ఉదయం బుల్డోజర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో 20 నుంచి 30 మంది వరకు గాయాలు అయ్యాయి. నాయుడుపేట- పూత్తలపట్టు రహదారిలోని తిరుపతి రూరల్ గొల్లపల్లి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న తిరుపతి రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన క్షత్రగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. చిత్తూరు-2 డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సుగా గుర్తించారు. ముందు వెళుతున్న బుల్డోజర్‌ను వెనుక వైపు నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


తిరుపతి ప్రమాదంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరా

తిరుపతి రూరల్ మండలం గొల్లపల్లి నేషనల్ హైవేపై బుల్డోజర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు ఘటనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరా తీశారు. ప్రమాదంలో తీవ్ర గాయలు పాలైన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని రుయా ఆస్పత్రి సిబ్బందికి మంత్రి సూచనలు చేశారు. తక్షణ సహాయక చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి

YSRCP : సజ్జల భార్గవ్‌ కేసుల వివరాలన్నీ ఇవ్వండి

Political Conflict : వైసీపీ నేతల ఆగడాలు అడ్డుకోండి

AP Skill Development : ఏపీలో 532 స్కిల్‌ హబ్‌లు

Read Latest AP News and Telugu News

Updated Date - Dec 17 , 2024 | 11:21 AM