ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tirupati: నేడే జాతీయ హిందూ ధార్మిక సదస్సు.. పలు తీర్మానాలు చేయనున్న స్వామీజీలు..

ABN, Publish Date - Oct 26 , 2024 | 09:21 AM

తిరుపతి జిల్లా తిరుచానూరు శిల్పారామంలో జాతీయ హిందూ ధార్మిక సదస్సు ఇవాళ (శనివారం) నిర్వహించనున్నారు. తిరుపతి క్షేత్రంలో మద్యం, మాంసం లేకుండా తిరుపతి క్షేత్రాన్ని టెంపుల్ సిటీగా మార్చాలని ఈ సమావేశంలో స్వామీజీలు డిమాండ్ చేయనున్నారు.

తిరుపతి: తిరుమల (Tirumala) స్వామివారి లడ్డూ ప్రసాదం కల్తీ నేపథ్యంలో హిందూ సంఘాలు (Hindu Communities) అప్రమత్తం అయ్యాయి. స్వామివారి పవిత్రతను కాపాడేందుకు నడుం కట్టాయి. దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాయి. ఈ మేరకు నేడు (శనివారం) తిరుచానూరు శిల్పారామంలో జాతీయ హిందూ ధార్మిక సదస్సు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న వందలాది మంది స్వామీజీలు పాల్గొననున్నారు. ఈ సదస్సు ఉదయం నుంచీ రాత్రి వరకూ జరగనుంది. తిరుపతి క్షేత్రంలో మద్యం, మాంసం లేకుండా తిరుపతి క్షేత్రాన్ని టెంపుల్ సిటీగా మార్చాలని ఈ సమావేశంలో స్వామీజీలు డిమాండ్ చేయనున్నారు.


అలాగే తిరుపతితోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పుణ్యక్షేత్రాల ప్రాంతాల్లో గోహత్యలు, అన్యమత ప్రచారాలు లేకుండా చట్టం చేయాలని స్వామీజీలు తీర్మానం చేసే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా సనాతన ధార్మిక బోర్డుల ఏర్పాటుపై వారంతా చర్చించనున్నారు. ఇటీవల తిరుమల స్వామివారి ప్రసాదం అపవిత్రతపై హిందూ సంఘాలు పెద్దఎత్తున నిరసనలు చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలను హిందూ సోదరులు తీవ్రంగా ఖండించారు. పవిత్రమైన పుణ్యక్షేత్రాల ప్రదేశాల్లో ఎటువంటి తప్పిదాలు జరగకుండా ఉండేందుకు హిందూ సంఘాలు ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున సదస్సు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న స్వామీజీలంతా ఒకే చోటుకి చేరి పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.

Updated Date - Oct 26 , 2024 | 09:21 AM