ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tirupati: అలిపిరిలో అమానవీయ ఘటన.. చెల్లి వరసయ్యే..

ABN, Publish Date - Sep 22 , 2024 | 08:01 AM

అలిపిరికి చెందిన ఓ మహిళ పనుల నిమిత్తం బెంగళూరులో నివసిస్తోంది. ఎంత కష్టపడైనా తన కుమార్తెను చదివించాలని అనుకుంది. అయితే బెంగళూరులో చదివించే స్తోమత లేక తన అక్క ఇంటి వద్ద ఉంచుతూ చదవిస్తోంది.

తిరుపతి: అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగు చూసింది. సభ్యసమాజం తలదించుకునేలా అన్న వరసయ్యే వ్యక్తి బాలికపై అత్యాచారం చేశాడు. ఎనిమిది నెలలుగా చిన్నారిపై అత్యాచారం చేస్తూ ఆ దుర్మార్గుడు కామవాంచలు తీర్చుకున్నాడు. అలిపిరికి చెందిన వలస కూలీ తన అక్క దగ్గర కుమార్తెను ఉంచడంతో ఈ అఘాయిత్యం జరిగింది. ఎనిమిది నెలల తర్వాత వచ్చిన తల్లికి బాలిక విషయం చెప్పడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.


అసలేం జరిగిందంటే..?

అలిపిరికి చెందిన ఓ మహిళ పనుల నిమిత్తం బెంగళూరులో నివసిస్తోంది. ఎంత కష్టపడైనా తన కుమార్తెను చదివించాలని అనుకుంది. అయితే బెంగళూరులో చదివించే స్తోమత లేక తన అక్క ఇంటి వద్ద ఉంచుతూ చదవిస్తోంది. అయితే అక్క కొడుకే తన కూతురి పట్ల కర్కశంగా వ్యవహరిస్తాడని ఆమె ఊహించలేకపోయింది. బాలిక స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదవుతూ రోజూ పాఠశాలకు వెళ్లివస్తోంది. ఇంట్లో ఉన్నవారు సైతం పనుల నిమిత్తం వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో పెద్దమ్మ కొడుకు బాలికపై కన్నేశాడు. గత ఫిబ్రవరి నుంచి ఆమెపై అత్యాచారం చేయడం మెుదలుపెట్టాడు. ఇంట్లో చెప్పొద్దని, చెప్తే చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో ఆమె ఇంట్లో చెప్పేందుకు సాహసించలేదు.


వినాయక చవితి పండగ సందర్భంగా బాలిక తల్లి బెంగళూరు నుంచి వచ్చింది. తల్లిని చూసి ఒక్కసారిగా విలపించిన బాలిక జరిగిన దారుణాన్ని ఆమెకు వివరించింది. పెద్దమ్మ కొడుకు ఎనిమిది నెలలుగా తనపై చేస్తున్న అఘాయిత్యాన్ని పూసగుచ్చినట్లు వివరించింది. దీంతో ఇద్దరూ కలిసి శనివారం రాత్రి అలిపిరి పోలీసులను ఆశ్రయించారు. అత్యాచారంపై ఫిర్యాదు చేశారు. ఘటనపై ఫోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Deputy CM: నేటి నుంచి పవన్ కల్యాణ్11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష..

Pantham Nanaji: క్షమాపణలు చెప్పిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ.. బూతుల దండకంపై ఏమన్నారంటే

Updated Date - Sep 22 , 2024 | 08:06 AM