Tirumala: తిరుమలకు కాలినడకన వెళ్తున్నారా.. ఈ సూచనలు తప్పనిసరి
ABN, Publish Date - Oct 25 , 2024 | 03:24 PM
తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులు తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు పాటించాలని టీటీడీ సూచించింది. అనారోగ్యంతో బాధపడే భక్తులు క్రమం తప్పకుండా వెంట మందులు తీసుకువెళ్లాలని నిర్దేశించింది. కొండపై వైద్య సదుపాయాలు అందుబాటులో ఎక్కడ ఉన్నాయో తెలిపింది.
తిరుమల: తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోడానికి భక్తులు అధికంగా వస్తుంటారు. భక్తులు ఎక్కువగా కాలినడకన కొండకు వచ్చి శ్రీనివాసుడిని దర్శించుకుంటారు. కాలినడకన కొండకు వెళ్తున్న సమయంలో కొంతమంది అనారోగ్యానికి గురైన సంఘటనలు ఉన్నాయి. ఈ క్రమంలో కాలినడకన వచ్చి శ్రీవారిని దర్శించుకోవాలనే భక్తులకు టీటీడీ పలు కీలక సూచనలను చేసింది. తరచూ అనారోగ్యంతో బాధపడే వారు మెట్ల మార్గాన్ని ఎంచుకోకూడదు? అని చెప్పింది. ఒకవేళ కాలినడకన రావాల్సి వస్తే, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొండపై వైద్య సదుపాయాలు అందుబాటులో ఎలా ఉన్నాయి? అనే విషయాలను టీటీడీ నిర్దేశించింది.
ALSO READ: TDP: రూ.100తో రూ.5 లక్షల బీమా.. టీడీపీ సభ్యత్వ నమోదు ఎప్పటి నుంచంటే
వారికి నడక దారి శ్రేయస్కరం కాదు...
60 ఏళ్లు దాటిన వృద్ధులు, మధుమేహం, అధిక రక్తపోటు, ఉబ్బసం, మూర్ఛ, కీళ్ల వ్యాధులు ఉన్న భక్తులు తిరుమలకు కాలినడకన వచ్చి ఇబ్బంది పడకూడదని టీటీడీ చెప్పింది.
ఒబేసిటితో బాధపడుతున్న భక్తులు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్న భక్తులు కొండకు నడక దారిన రావడం శ్రేయస్కరం కాదని టీటీడీ తెలిపింది.
శ్రీనివాసుడి కొండ సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉండటంతో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుందని టీటీడీ పేర్కొంది. కొండకు కాలినడకన రావడం చాలా ఒత్తిడితో కూడుకున్న విషయమని తెలిపింది. గుండె సంబంధిత వ్యాధులు, ఆయాసంతో ఇబ్బంది పడతారని.. భక్తులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది.
అనారోగ్య కారణాలతో వెళ్లేవారు ఇవి పాటించాలి..
అనారోగ్య కారణాలతో బాధపడుతున్న భక్తులు తమ వెంట మందులు తెచ్చుకోవాలని సూచించింది.
కాలినడకన వచ్చే భక్తులకు ఏమైనా సమస్యలు వస్తే అలిపిరి కాలిబాట మార్గంలోని 1500 మెట్టు, గాలి గోపురం, భాష్యకార్ల సన్నిధి వద్ద వైద్య సహాయం అందుబాటులో ఉంటుందని తెలిపింది.
తిరుమలలోని ఆశ్వినీ ఆస్పత్రి, ఇతర వైద్యశాలల్లో 24 గంటల పాటు వైద్య సదుపాయం అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
తరచూ కిడ్నీ సమస్యలతో బాధపడే వారు అత్యవసర పరిస్థితుల్లో తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో డయాలసిస్ సౌకర్యం కల్పిస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి..
Kandula Durgesh: త్వరలోనే నూతన టూరిజం పాలసీ
AP Govt: విజయవాడ వరద బాధితులకు పరిహారం విడుదల..
AP Politics: మరీ ఇలా అయితే ఎలా జగన్..
Read Latest AP News And Telugu News
Updated Date - Oct 25 , 2024 | 04:02 PM