AP politics: కుప్పం నియోజకవర్గంలో మరోసారి రెచ్చిపోయిన వైసీపీ మూకలు..
ABN, Publish Date - Jun 01 , 2024 | 03:10 PM
రాష్ట్రంలో వైసీపీ మూకల దాడులకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. మాచర్ల, తిరుపతి, తాడిపత్రి ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో అధికారులపై వేటు వేసింది. అయితే ఈవీఎం, వీవీప్యాట్ పగలకొట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయకపోవడంతో తమను ఎవరూ ఏం చేయలేరనే భావం వైసీపీ అల్లరి మూకల్లో బాగా పెరిగింది. దీంతో గన్నవరం నియోజకవర్గం సహా రాష్ట్రంలో మరికొన్ని చోట్ల కూటమి శ్రేణులే లక్ష్యంగా దాడులకు దిగుతున్నారు.
చిత్తూరు: రాష్ట్రంలో వైసీపీ మూకల దాడులకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. మాచర్ల, తిరుపతి, తాడిపత్రి ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission of India) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో అధికారులపై వేటు వేసింది. అయితే ఈవీఎం, వీవీప్యాట్ పగలకొట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(Pinnelli Ramakrishna Reddy)ని అరెస్టు చేయకపోవడంతో తమను ఎవరూ ఏం చేయలేరనే భావం వైసీపీ అల్లరి మూకల్లో బాగా పెరిగింది. దీంతో గన్నవరం నియోజకవర్గం సహా రాష్ట్రంలో మరికొన్ని చోట్ల కూటమి శ్రేణులే లక్ష్యంగా దాడులకు దిగుతున్నారు.
తాజాగా కుప్పం నియోజకవర్గంలో వారం రోజులుగా వైసీపీ మూకలు పేట్రేగిపోతున్నారు. టీడీపీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. కౌంటింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో అల్లర్లు సృష్టించాలనే ఉద్దేశంతో రెచ్చిపోతున్నారు. ఎన్.కొత్తపల్లి గ్రామంలో ఇదే పరిస్థితి నెలకొంది. మద్యం సేవించిన అల్లరిమూకలు గుంపులుగా తిరుగుతూ గ్రామస్థులను భయాందోళనలకు గురి చేస్తున్నారు. ప్రశ్నించిన టీడీపీ కార్యకర్త జయశంకర్‌పై దాడి చేశారు. తీవ్రగాయాలు కావడంతో గ్రామస్థులు ఆస్పత్రికి తరలించి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పోలీసులు ఎన్ని విధాలుగా హెచ్చరికలు జారీ చేస్తున్నా.. వారు మాత్రం లెక్క చేయడం లేదు. హింసే ఆయుధంగా వైసీపీ మూకలు ముందుకు సాగుతున్నారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని లేదంటే ఓట్లు కౌంటింగ్ రోజు వారు పెద్దఎత్తున దాడులకు తెగబడే అవకాశం ఉందని కూటమి శ్రేణులు ఆరోపిస్తున్నారు.
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jun 01 , 2024 | 03:15 PM