Andhra Pradesh: పెద్దిరెడ్డికి బిగ్ షాక్.. కలెక్టర్ కీలక ఆదేశాలు..
ABN, Publish Date - Jul 17 , 2024 | 11:49 AM
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. పెద్దిరెడ్డి భూముల దందాలకు బ్రేక్ వేశారు చిత్తూరు జిల్లా కలెక్టర్. పుంగునూరు నియోజకవర్గం రాగాని పల్లిలో రూ. 100 కోట్లు విలువ చేసే 982 ఎకరాల ప్రభుత్వ అనాదీన భూములను పెద్దిరెడ్డి, ఆయన అనుచరులు కాజేశారు.
చిత్తూరు, జులై 17: వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి(Peddireddy Ramachandra Reddy) బిగ్ షాక్ తగిలింది. పెద్దిరెడ్డి భూముల దందాలకు బ్రేక్ వేశారు చిత్తూరు(Chittoor) జిల్లా కలెక్టర్. పుంగునూరు నియోజకవర్గం రాగాని పల్లిలో రూ. 100 కోట్లు విలువ చేసే 982 ఎకరాల ప్రభుత్వ అనాదీన భూములను పెద్దిరెడ్డి, ఆయన అనుచరులు కాజేశారు. పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ఆయన అనుచరులకు నాటి అధికారులు ఈ భూములను కట్టబెట్టారు. అయితే, కొత్త ప్రభుత్వంలో వీరి అరాచకాలు, అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి.
తాజాగా స్థానిక రైతులు కొందరు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ భూములను కబ్జా చేశారని.. పెద్ది రెడ్డి అనుచరుల పేరిట ఆ భూములను రిజిస్ట్రేషన్ చేశారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన కలెక్టర్.. వెంటనే అన్యాక్రాంతమైన భూములపై ఫోకస్ పెట్టారు. ఈ భూములపై రివిజన్ పిటిషన్ వేయాలని ల్యాండ్ సెటిల్‌మెంట్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు జిల్లా కలెక్టర్.
అధికారం ఉందని రెచ్చిపోయారు..
పుంగునూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలు అన్నీఇన్నీ కావని స్థానికులు చెబుతున్నారు. అధికారం దర్పంతో తాను ఏం చేసినా చెల్లుద్దని.. ఇష్టారీతిన వ్యవహరించేవారని ఆరోపిస్తున్నారు. వందలాది ఎకరాల భూములను కబ్జా చేశారని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి దోపిడీపై, కబ్జాలపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నియోజకవర్గ ప్రజలు.
Also Read:
తిరుమలకు వెళ్లే భక్తులకు బంపరాఫర్!
అంబానీ కుటుంబానికి జామ్‌నగర్ ఎందుకంత సెంటిమెంట్?
రేపు రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో రేవంత్ సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Jul 17 , 2024 | 11:49 AM