ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Lokesh: చిత్తూరు జిల్లాలో మంత్రి లోకేశ్ పర్యటన.. వివరాలు ఇవే..

ABN, Publish Date - Sep 20 , 2024 | 09:28 AM

ఏపీ మంత్రులు నారా లోకేశ్, సత్యకుమార్ యాదవ్ శుక్రవారం ఉదయం 10నుంచి 11గంటల మధ్య బంగారుపాళ్యం గ్రామానికి చేరుకుంటారు. ఎన్నికల హామీ మేరకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించనున్నారు.

AP Education Minister Nara Lokesh

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్(Lokesh) ఇవాళ(శుక్రవారం) చిత్తూరు(Chittoor) జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఎన్నికల హామీ మేరకు పలు ప్రారంభోత్సవాలు, స్థానిక యువతతో భేటీ కానున్నారు. మంత్రి లోకేశ్‌తోపాటు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సైతం పర్యటనలో పాల్గొననున్నారు. మంత్రి పర్యటించే గ్రామాలకు ఇప్పటికే పెద్దఎత్తున టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు.


పర్యటన వివరాలు ఇవే..

ఏపీ మంత్రులు నారా లోకేశ్, సత్యకుమార్ యాదవ్ శుక్రవారం ఉదయం 10నుంచి 11గంటల మధ్య బంగారుపాళ్యం గ్రామానికి చేరుకుంటారు. ఎన్నికల హామీ మేరకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించనున్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా జిల్లాలో పర్యటించిన మంత్రికి గ్రామస్థులు తమ బాధలను వివరించారు. అనేక మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నట్లు వాపోయారు. డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు నారా లోకేశ్ డయాలిసిస్ సెంటర్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100రోజుల్లోనే సెంటర్ను ఏర్పాటు చేసి ప్రారంభిస్తున్నారు. దీంతో ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ఈ కార్యక్రమం అనంతరం మంత్రి లోకేశ్ మధ్యాహ్నం ఒంటిగంటకు మంత్రి సత్యకుమార్‌తో కలిసి నల్లగాడు కోటూరు గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం స్థానిక ప్రభుత్వ పాఠశాలను సందర్శిస్తారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి విద్య అందుతున్న తీరు, మౌలిక వసతులు వంటి అంశాలపై ఆరా తీయనున్నారు. మధ్యాహ్నం 3గంటలకు పర్యటన ముగించుకుని తిరిగి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం అక్కడ్నుంచి విజయవాడకు బయలుదేరనున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

CM Chandrababu: ప్రకాశం జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన.

Live Updates: రహస్య ప్రదేశంలో జానీ మాస్టర్‌ను విచారిస్తున్న పోలీసులు!

Vijayawada: ప్రకాశం బ్యారేజీ నుంచి రెండో బోటు బయటకి.. వివరాలు ఇవే..

Updated Date - Sep 20 , 2024 | 09:30 AM