TDP Vs YSRCP: మాజీ మంత్రి పెద్దిరెడ్డి కంచుకోటలో టీడీపీ మాస్టర్ ప్లాన్!
ABN , Publish Date - Aug 05 , 2024 | 10:33 AM
Andhrapradesh: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతి అక్రమాలపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి బృందంతో కూడిన టీడీపీ శ్రేణులు క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. ఆవులపల్లి ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలపై రైతులతో క్షేత్రస్థాయి పర్యటనలో ముఖాముఖి నిర్వహించనున్నారు. పెద్దిరెడ్డి అవినీతి అక్రమాలపై పుంగనూరులో మంత్రి ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు.
చిత్తూరు, ఆగస్టు 5: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (former minister Peddireddy Ramachandrareddy) అవినీతి అక్రమాలపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి బృందంతో కూడిన టీడీపీ (TDP) శ్రేణులు క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. ఆవులపల్లి ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలపై రైతులతో క్షేత్రస్థాయి పర్యటనలో ముఖాముఖి నిర్వహించనున్నారు. పెద్దిరెడ్డి అవినీతి అక్రమాలపై ఆయన కంచుకోట అయిన పుంగనూరులో మంత్రి ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో టీడీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టనున్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి చల్ల రామచంద్రారెడ్డితో పాటు పలువురు టిడిపి బృందం కలిసి క్షేత్రస్థాయి పర్యటన చేయనున్నారు.
AP Pensions: ఏపీలో కొత్త పెన్షన్లు ఎప్పుడో..!?
కాగా.. టీడీపీ శ్రేణుల క్షేత్రస్థాయి పర్యటనలపై రెండు రోజుల క్రితం మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ... మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతి అక్రమాలు, భూముల దందాపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి అవినీతి అక్రమాలను బయటకు తీసే క్షేత్రస్థాయి పర్యటనకు శ్రీకారం చుడుతున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
ఇటీవల మదనపల్లి ఆర్డీవో కార్యాలయంలో 22ఏ భూముల రికార్డులు అగ్నిఆహుతైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు బయటపడతాయని రికార్డులను కాల్చివేశారని ప్రచారం జోరుగా సాగింది. పుంగనూరులో పెద్దిరెడ్డి కుటుంబ అక్రమాలు, అరాచకాలు వైసీపీ ప్రభుత్వం అండ చూసుకుని ఐదేళ్లు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు చెలరేగిపోయారు. పెద్దిరెడ్డి కుటుంబం చేతిలో మోసపోయిన బాధితులు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి భారీగా చేరుకుని ఫిర్యాదు చేశారు. రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా బాధితుల వినతిపత్రాలు స్వీకరించారు. అయితే ఫైళ్ల దహనం ఘటనపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. మదనపల్లి డివిజన్‌లోని 11 మండలాల తహసీల్దార్‌లతో సిసోడియా సమావేశమయ్యారు. ఫైళ్ల దహనం ఘటనపై పోలీసుల దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది.
CM Revanth Reddy: అమెరికా పర్యటనలో సీఎం రేవంత్ బిజీబిజీ
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన భారీ భూ అక్రమాల్లో ఇదొకటి. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం రాగానిపల్లెలో 982 ఎకరాల భూమిని నిబంధనలకు పాతరేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషుల పేరిట మార్చారు. ఎస్టేట్‌ల రద్దు చట్టం-1948 అమలులో ఇదో చీకటి అధ్యాయం. బహుశా దేశంలో మరెక్కడా జరిగి ఉండదు. మంత్రి, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులు కూడబలుక్కొని భూమిని అనర్హుల చేతిలో పెట్టారు. ఆ భూమిపై రైత్వారీ పట్టాలు జారీ చేస్తూ ఎలాంటి ఆదేశం ఇవ్వలేదు. కనీసం సెటిల్‌మెంట్ అధికారి వద్ద అప్పీల్ చేయలేదు. ప్రత్యేక విచారణ జరగలేదు. కేవలం ఓ రఫ్ పట్టాను మాత్రమే నిర్ధారించారు. ఆగమేఘాల మీద ఆ భూమి రికార్డులు మార్చారు. ఒకే రోజులో సర్వే చేశారు. భూమిని సబ్ డివిజన్ చేశారు. ఆ తర్వాత ఆ భూమి నాటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన అనుచరుల చేతికి చిక్కింది. ఈ చీకటి చరిత్రలో నాటి చిత్తూరు జేసీ, నేటి తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్, నాటి చిత్తూరు కలెక్టర్ హరినారాయణన్ కీలక పాత్రధారులని తాజాగా వెలుగుచూసిన విషయం తెలిసిందే..
ఇవి కూడా చదవండి...
Delhi: దాయాదికి అనుకూల స్లోగన్స్..
Youtube : యూట్యూబర్లపై ఆంక్షల పిడుగు!
Read Latest AP News And Telugu News