Karnataka Student: బ్యాట్, బెల్ట్‌తో బాదారు.. ఎందుకంటే..?
ABN , Publish Date - Aug 05 , 2024 | 08:52 AM
తరుణ్ కుమార్, అరుణ్ కుమార్ అనే ఇద్దరు చిన్నారులు రాయ్ చూర్ రామకృష్ణ ఆశ్రమంలో చదువుకుంటున్నారు. ఆర్థిక పరిస్థితుల వల్ల ఇంటి వద్ద ఉంచుకొని చదివించుకోలేని పరిస్థితి తల్లిదండ్రులది.. అందుకే ఆశ్రమంలో వేశారు. తరుణ్ మూడో తరగతి, అరుణ్ ఐదో తరగతి చదువుతున్నాడు. వీలు చూసుకొని పిల్లల వద్దకు తల్లి వచ్చేవారు. ఇటీవల ఆశ్రమానికి రాగా, చిన్న కుమారుడు తరుణ్‌ను చూసి ఆశ్చర్యపోయింది.
రాయచూర్: అభం శుభం తెలియని వయస్సు. ఏది మంచి, చెడో ఊహించని పరిస్థితి. ఆర్థిక పరిస్థితుల వల్ల ఆశ్రమంలో చదువుకుంటున్నాడు. తమ బిడ్డ చదివి ప్రయోజకుడు అవుతారని పేరంట్స్ భావించారు. కానీ ఆశ్రమ ఇంఛార్జీ నరరూప రాక్షసుడు. ఓ చిన్న కారణంతో వేధించాడు. టార్చర్ పెట్టాడు. తరుణ్ కుమార్ (Tarun Kumar) అనే చిన్నారికి చుక్కలు చూపించాడు.
ఇదీ విషయం..
తరుణ్ కుమార్, అరుణ్ కుమార్ అనే ఇద్దరు చిన్నారులు రాయ్ చూర్ రామకృష్ణ ఆశ్రమంలో చదువుకుంటున్నారు. ఆర్థిక పరిస్థితుల వల్ల ఇంటి వద్ద ఉంచుకొని చదివించుకోలేని పరిస్థితి తల్లిదండ్రులది.. అందుకే ఆశ్రమంలో వేశారు. తరుణ్ మూడో తరగతి, అరుణ్ ఐదో తరగతి చదువుతున్నాడు. వీలు చూసుకొని పిల్లల వద్దకు తల్లి వచ్చేవారు. ఇటీవల ఆశ్రమానికి రాగా, చిన్న కుమారుడు తరుణ్‌ను చూసి ఆశ్చర్యపోయింది. అతని ఒంటిపై గాయాలు, కంటిపై కూడా గాయమవడం గమనించింది. దాంతో జరిగిన విషయాన్ని తరుణ్, ఆమె పెద్దకుమారుడు అరుణ్ పూసగుచ్చినట్టు వివరించారు.
ఏం జరిగిందంటే..?
‘తరుణ్ వద్ద పెన్ లేదు. శనివారం నాడు తరుణ్‌కు మరో విద్యార్థి టీచర్ (ఆశ్రమ ఇంచార్జీ) పెన్ను ఇచ్చాడు. అలా తీసుకోవడమే పాపమైపోయింది. ఆ పెన్ను అతనిదేనని తరుణ్ అనుకున్నాడు. ఆ మరునాడు టీచర్ పెన్ను కోసం వెతికారు. అందరిని పరిశీలించగా తరుణ్ వద్ద పెన్ను లభించింది. దాంతో నా కుమారుడికి టార్చర్ మొదలైంది. పెన్ను తీయకున్నా తీశాడని విచక్షణరహితంగా దాడి చేశారు. దాంతో పసి మనస్సు గాయపడింది. చేయని తప్పుకు శిక్ష వేశారని, భవిష్యత్‌లో దొంగగా మారే ప్రమాదం ఉంది. టీచర్, కొందరు విద్యార్థులు దాడి చేయడంతో నా కుమారుడి పరిస్థితి దారుణంగా తయారైంది. నీ బిడ్డకు పునర్జన్మ వచ్చిందని నాతో కొందరు అంటున్నారు. అంతలా తరుణ్‌పై దాడి చేశారు. బెల్ట్‌తో కొట్టడం ఏంటి, కళ్లకు గంతలు కట్టి, చేతులకు తాడు కట్టి మరి టీచర్ దాడి చేశాడు. కాలిపై కూడా తన్నాడట. అర్ధరాత్రి వరకూ కొడుతూనే ఉన్నాడు అని’ అతని తల్లి స్పష్టం చేశారు.
కర్ర, బ్యాట్‌తో దాడి
‘పెన్ను దొంగిలించారని టీచర్, ఇద్దరు విద్యార్థులు నన్ను కొట్టారు. తొలుత కర్రలతో కొట్టారు. అది విరగడంతో బ్యాట్ తీసుకొని కొట్టడం ప్రారంభించారు. ఆ దాడికి సంబంధించి నా శరీరంపై గాయాలు ఉన్నాయి. పెన్ను దొంగిలించానని, డబ్బులు ఇవ్వాలని అడిగారు. లేవని చెప్పడంతో తనను యాద్గిర్ తీసుకెళ్లారు. రైల్వే స్టేషన్ వద్ద భిక్షం ఎత్తాలని ఆదేశించారు. నాకు ఒక చిల్విగవ్వ రాలేదు. తర్వాత కూడా దాడి చేయడంతో శరీరం అంతా గాయాలు అయ్యాయి. కన్ను కూడా దెబ్బతింది అని’ఆ చిన్నారి ఏం జరిగిందో కళ్లకు కట్టికట్టు వివరించాడు. ఆ విద్యార్థి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.
బాలుడిని కాపాడాం
ఘటనపై బాలల హక్కుల కార్యకర్య సుదర్శన్ స్పందించారు. ‘ ఆ బాలుడిని టీచర్ బారి నుంచి కాపాడాం. ఈ విషయం ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఘటనపై మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ కల్పించుకోవాలని కోరాం. ఆశ్రమ ఇంచార్జీపై కేసు నమోదు చేశాం అని’ సుదర్శన్ వివరించారు. పెన్ను తీసుకున్నారనే ఆరోపణలతో ఓ బాలుడిపై ఆశ్రమ ఇంచార్జీ వేణుగోపాల్ ఇలా ప్రవర్తించడం సరికాదు. అతని తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
For Latest News and National News Click Here