ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YS Jagan: అంతా కల్తీ.. ఐదేళ్లు మాటలతో మాయ..

ABN, Publish Date - Sep 21 , 2024 | 08:52 AM

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. కోట్లాది మంది భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉండటంతో ప్రతి ఒక్కరూ ఈ అంశంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైసీపీ అధ్యక్షులు జగన్ మాత్రం కల్తీ నెయ్యి మరకలు తనకు అంటకుండా..

YS Jagan

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారన్న విషయం బయటకు రావడంతో వైసీపీ అధ్యక్షులు జగన్ ఉలిక్కిపడుతున్నారా.. ఆ పార్టీ శ్రేణులు సైతం జగన్ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తిరుపతి లడ్డూ నాణ్యత, రుచి తగ్గిందంటూ ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ప్రసాదం లడ్డూ నాణ్యతలో రాజీపడేది లేదంటూ అప్పటి ప్రభుత్వం వివరణ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ప్రసాదం తయారీలో రుచిని పెంచేది నాణ్యమైన నెయ్యి. ఆ నెయ్యిలో కల్తీ జరిగిందంటూ ప్రస్తుతం ల్యాబ్ నివేదికలు బయటపడ్డాయి. దీంతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా ఈ అంశం కలకలం రేపింది. కోట్లాది మంది భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉండటంతో ప్రతి ఒక్కరూ ఈ అంశంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైసీపీ అధ్యక్షులు జగన్ మాత్రం కల్తీ నెయ్యి మరకలు తనకు అంటకుండా టీడీపీ కూటమి ప్రభుత్వానికి అంటించే ప్రయత్నం చేస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి రాకముందే నెయ్యిలో కల్తీ జరిగిందంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి 2014-19 మధ్య కాలంలో తిరుమలలో ప్రసాదం తయారీకి బ్రాండెండ్ నెయ్యిని ఉపయోగించేవారు. ప్రసాదం తయారీ కోసం నాణ్యత కలిగిన పదార్థాలను మాత్రమే వాడేవారు. నెయ్యి కొరత కారణంగా క్వాంటిటీ విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించేవారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్వాంటిటీని పెంచే ప్రయత్నం చేసింది. అవసరమైన స్వచ్చమైన నెయ్యి మార్కెట్‌లో అందుబాటులో లేకపోయినా క్వాంటిటీని పెంచడంతోనే కల్తీ నెయ్యి వినియోగించారనే విషయం స్పష్టమవుతుందనే చర్చ జరుగుతోంది. తాజాగా ల్యాబ్ రిపోర్టులు నెయ్యిలో కల్తీ జరిగిందని స్పష్టం చేయడంతో వైసీపీ అసలు రంగు బయటపడింది.

విద్యాసాగర్‌ అరెస్టు


అంతా కల్తీ..

తిరుపతి లడ్డూ వ్యవహారం బయటపడటంతో జగన్ ఐదేళ్ల పాలనను ఓసారి గుర్తుచేసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ చెప్పేవన్నీ అబద్ధాలు.. చేసేవన్నీ మోసాలని ఎన్నికల ఫలితాలతో ప్రజలు తేల్చేశారు. జగన్ పాలన అవసరం లేదని తీర్పునిచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మాటలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేశానంటూ ప్రచారం చేసుకున్నారు. జగన్ వ్యవహరమే ఓ కల్తీగా మారిపోయిన పరిస్థితిని ఏపీ ప్రజలు చూశారు. ప్రజాస్వామ్యంలో ఓసారి ఓటరు తీర్పు చెప్పిన తర్వాత ఐదేళ్లపాటు ఆ ప్రభుత్వాన్ని భరించాల్సి ఉంటుంది. దీంతో జగన్ మోసాలను ప్రత్యక్షంగా చూసినప్పటికీ ఐదేళ్లూ ప్రజలు భరించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారు. జగన్ పైకి చెప్పేది ఒకటి.. చేసేది మరొకటని తాజాగా ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. జగన్ వ్యవహారశైలి నచ్చకపోవడంతో కొందరు నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. జగన్ ఆలోచనల్లోనే మాయ, మోసం దాగి ఉంటాయనే చర్చ సాగుతోంది.

ఎన్నికల్లో, పాదయాత్రలో ఇచ్చిన.. ప్రతి హామీ అమలు చేస్తాం


ప్రత్యక్షంగా కాకపోయినా..

తిరుపతి లడ్డూల తయారీలో ఉపయోగించే నెయ్యిలో కల్తీకి జగన్ ఎలా కారణమవుతారనే వాదనను కొందరు వినిపిస్తున్నారు. ప్రత్యక్షంగా జగన్ కారణం కాకపోయినా.. ప్రపంచ ప్రసిద్ధ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఏం జరుగుతుందనేది తెలుసుకోవల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. టీటీడీ పాలకమండలిని నియమించేది రాష్ట్రప్రభుత్వమే. దీంతో పాలకమండలితో పాటు తిరుమలలో జరిగే పొరపాట్లకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. కల్తీ నెయ్యిని సరఫరా చేస్తుంటే అధికారులు ఏం చేశారు.. అధికారులు నియంత్రించే ప్రయత్నం చేసినా ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే కల్తీ నెయ్యి సరఫరా జరిగిందా అనేది విచారణలో తేలాల్సిఉంది.

సంప్రోక్షణ చేయండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News Click Here

Updated Date - Sep 21 , 2024 | 10:33 AM