Tirumala: శారదా పీఠం అక్రమ నిర్మాణాల కూల్చివేతకు రంగం సిద్ధం
ABN, Publish Date - Oct 25 , 2024 | 12:18 PM
Andhrapradesh: తిరుమలలో రోడ్డును కూడా ఆక్రమించి మరీ శారదా పీఠం మఠం నిర్వాహకులు భారీ భవనాలను నిర్మిస్తున్నారు. చెరువులను కూడా ఆక్రమించేసి మరీ నిర్మాణాలు చేపట్టారు. టీటీడీ అధికారుల లెక్కల ప్రకారం దాదాపు 20వేల చదరపు అడుగుల్లో శారదా పీఠం అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది.
తిరుమల, అక్టోబర్ 25: శారదా పీఠం భవనాల కూల్చివేతకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ (AP Govt) ఆదేశాలతో శారదా పీఠం అక్రమ నిర్మాణాలు కూల్చేందుకు టీటీడీ (TTD) నిర్ణయం తీసుకుంది. తిరుమలలో అక్రమ నిర్మాణాలు తొలగించాలని శారదా పీఠానికి టీటీడీ అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు.. తదనంతరం అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను టీటీడీ కూల్చివేయనుంది. టీటీడీ భూముల్లో నిబంధనలను అతిక్రమించి శారదా పీఠం నిర్మాణాలు చేశారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఈవోకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
AP Politics: అయ్యో.. ఉష.. మీరింకా మంత్రి కాదమ్మా..!
కాగా.. గత కొన్ని సంవత్సరాలుగా తిరుమలలో శారదా పీఠం అక్రమ నిర్మాణాలను చేపట్టింది. దాదాపు 20వేల చదరపు అడుగుల్లో శారదా పీఠం అక్రమ నిర్మాణాలు చేపట్టింది. 2007లో మొదటి సారి అక్రమ నిర్మాణాలను శారదా పీఠం చేపట్టింది. తర్వాత 2019 నుంచి కూడా ఆ నిర్మాణాలను కొనసాగిస్తూనే ఉంది. తిరుమలలో రోడ్డును కూడా ఆక్రమించి శారదా పీఠం మఠం నిర్వాహకులు భారీ భవనాలను నిర్మిస్తున్నారు. చెరువులను ఆక్రమించేసి మరీ నిర్మాణాలు చేపట్టారు. టీటీడీ అధికారుల లెక్కల ప్రకారం దాదాపు 20 వేల చదరపు అడుగుల్లో శారదా పీఠం అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది. గత ఏడాది డిసెంబర్లో టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఉన్న పాలకమండలి ఈ అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరిస్తూ రూ.30 లక్షల జరిమానాను విధిస్తూ తీర్మానం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించింది.
Spam Calls: స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఒక్క సెట్టింగ్ చేస్తే చాలు.. స్పామ్ కాల్స్ నుంచి రిలీఫ్...
అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే శారదా పీఠం అక్రమ నిర్మాణాలపై ఈవో సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపించారు. దీన్ని క్షుణ్ణంగా పరిశీలించిన దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి గత పాలకమండలి ఇచ్చిన ధృవీకరణను రద్దు చేసింది. అలాగే శారదా పీఠం చేపట్టిన అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని టీటీడీ ఈవోను దేవాదాయ శాఖ ఆదేశించింది. అయితే ఈ అక్రమ నిర్మాణాలకు సంబంధించిన కేసు కోర్టు పరిధిలో ఉండటంతో ఈ నిర్మాణాలను కూల్చివేసేందుకు ప్రస్తుతం టీటీడీకి కూడా అవకాశం లేకపోవడంతో భవనానికి సంబంధించి ఎక్కడెక్కడ అక్రమ నిర్మాణాలు జరిగిందన్న దానిపై టీటీడీ ఈవో మరికాసేపట్లో అక్కడకు చేరుకుని పరిశీలించే అవకాశం ఉంది. అక్రమ నిర్మాణాలపై తొలి నుంచి తిరుపతి జనసేన అసెంబ్లీ ఇన్చార్జ్ కిరణ్ రాయల పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.
ఇది శుభపరిణామం: కిరణ్
అక్రమ నిర్మాణాలపై తొలి నుంచి తిరుపతి జనసేన అసెంబ్లీ ఇన్చార్జ్ కిరణ్ రాయల పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కిరణ్ రాయల ఏబీఎన్‌తో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే శారదా పీఠం అక్రమాలకు సంబంధించి మంచి నిర్ణయం తీసుకుందని తెలిపారు. జగన్ మోహన్‌ను రెడ్డిని దత్త పుత్రుడి కన్నా ఎక్కువగా చూసుకున్న దొంగ స్వామి అనేక చోట్ల భక్తి పేరుతో కోట్లు కాజేశారని ఆరోపించారు. తిరుమలలోనూ 5వేల చదరపు అడుగుల భూమిలో శారదా పీఠానికి అక్రమంగా కట్టుకునేందుకు కేవలం 30 లక్షలు ఇవ్వాలని గత ప్రభుత్వం జీవో ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటేశ్వర స్వామి ఆస్తిని కాజేయాలని చూశారన్నారు. ఈ విషయాన్ని సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. దీంతో వెంటనే అక్రమ కట్టడాలను కూల్చివేయాలని టీటీడీకి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం శుభపరిణామమన్నారు. ఈవో వెంటనే చర్యలు తీసుకుని కూల్చివేస్తే భవిష్యతులో అక్రమ కట్టడాలు కట్టేందుకు భయం పడే పరిస్థితి ఉంటుంది కిరణ్ రాయల వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
Elephants: ఓకేసారి 16 ఏనుగుల గుంపు.. హడలెత్తిపోయిన ప్రజలు
Narayana: దాచేపల్లిలో డయేరియా పరిస్థితిపై మంత్రి నారాయణ సమీక్ష
Read Latest AP News And Telugu News
Updated Date - Oct 25 , 2024 | 12:26 PM