ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tirumala: తిరుమల శ్రీవారి కానుకలు వేలం.. ఎప్పుడంటే?

ABN, Publish Date - Aug 24 , 2024 | 03:42 PM

తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) వేంకటేశ్వర స్వామివారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం లక్షల మంది భక్తులు వస్తుంటారు. వారంతా ఆయనకు వివిధ రకాల వస్తువులు సమర్పిస్తుంటారు. అయితే వాటిని వేలం వేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) వేంకటేశ్వర స్వామివారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం లక్షల మంది భక్తులు వస్తుంటారు. వారంతా ఆయనకు వివిధ రకాల వస్తువులు సమర్పిస్తుంటారు. అయితే వాటిని వేలం వేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.


తిరుమల వేంకటేశ్వర స్వామిని కనులారా చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు నిత్యం లక్షల్లో వస్తుంటారు. ఆయణ్ను కల్లారా చూస్తే చాలు జీవితం ధన్యమని భావిస్తారు. ఈ క్రమంలో చాలా మంది తలనీలాలు సమర్పిస్తే మరికొంతమంది బంగారం, వెండి, కాపర్, సిల్వర్ కోటెడ్ రాగి రేకులు, విదేశీ కరెన్సీ, ఇండియన్ కరెన్సీ, కెమెరాలు, మొబైల్స్, చేతి వాచీలు సహా ఇలా రకరకాల వస్తువులు స్వామివారి హుండీలో వేస్తుంటారు.


అయితే వాటిని వేలం వేసేందుకు టీటీడీ తాజాగా నిర్ణయం తీసుకుంది. కానుకలు సొంతం చేసుకునే అవకాశాన్ని భక్తులకు టీటీడీ కల్పించింది. అయితే కానులు ఏంటి, ఎప్పుడు వేలం నిర్వహిస్తారు, వేలంలో ఏఏ వస్తువులు పెట్టనున్నారో తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేసింది. మరో విషయం ఏంటంటే వేలాన్ని ఆఫ్ లైన్ విధానం ద్వారా నిర్వహించనున్నారు. ఆసక్తి గల భక్తులు టెండర్ కమ్ వేలంలో పాల్గొనాలంటూ టీటీడీ తెలిపింది.


వేలానికి పెట్టనున్న వస్తువులు ఇవే..

తిరుమల ఆలయంతోపాటు అనుబంధ ఆలయాల్లో భక్తులు సమర్పించిన వస్తువులు వేలం వేయనున్నారు. భక్తులు స్వామివారికి సమర్పించిన కెమెరాలను ఆగస్టు 28న వేలం వేయనున్నారు. వీటిల్లో ఉపయోగించిన, పాక్షికంగా దెబ్బతిన్న కెమెరాలు ఉన్నాయి. మొత్తం 6లాట్లు ఉండగా వాటిని ఆగస్టు 28న వేలం వేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే కాపర్-2, సిల్వర్‌ కోటెడ్‌ రాగి రేకులను ఆగస్టు 30, 31వ తేదీల్లో టెండర్‌ కమ్‌ వేలం వేయనున్నారు. ఆగస్టు 30న కాపర్- 2 రేకులు 3వేల కేజీలను 15లాట్లుగా పెట్టి వేలం వేస్తారు. అలాగే ఆగస్టు 31న సిల్వర్‌ కోటెడ్‌ రాగి రేకులు 2,400 కేజీలను12లాట్లుగా పెట్టి వేలం వేయనున్నారు.


టెండర్ లేదా వేలంలో పాల్గొనాలని అనుకునే భక్తులు మరింత సమాచారం కోసం తిరుపతిలోని టీటీడీ ఆఫీసులో సంప్రదించాలి. దూరప్రాంతాల వారు 0877-2264429 నంబర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. www.tirumala.org ద్వారా కూడా టెండర్, వేలానికి సంబంధించి వివరాలు తెలుసుకోవచ్చని టీటీడీ తెలిపింది.

ఇవి కూడా చదవండి...

Subhash: జగన్‌పై విరుచుకుపడ్డ మంత్రి సుభాష్

TDP-YSRCP: సవాళ్లు.. ప్రతిసవాళ్లు... తిరువూరులో ఉద్రిక్తత

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 24 , 2024 | 03:48 PM

Advertising
Advertising
<